ప్రత్యేక సీమకైతే సరే: సాయి ప్రతాప్, క్రిమినల్: నారాయణ

రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలని చూస్తే సహించబోమని ఆయన అన్నారు. రాయలసీమను ఢిల్లీ పెద్దలు విడదీయాలని అనుకోవడం హేయమైన చర్య అని సాయి ప్రతాప్ అన్నారు.
రాయల తెలంగాణ అనేది ఓ క్రిమినల్ ప్రతిపాదన అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఆయన గురువారం తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను నిరాశలోకి నెట్టడానికే రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ గురువారంనాడు హైదరాబాదులోని హిమాయత్ నగర్ జంక్షన్ వద్ద సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జివోఎం శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు.












Click it and Unblock the Notifications