ఒక్క అడుగు దూరంలో రెండు నియోజకవర్గాలు.. వేస్తారా?

విభజన సమయంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేసిన డ్రామాల్ని చూస్తే ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చనే అభిప్రాయం ప్రజల్లో కలిగిందంటే అతిశయోక్తి కాదు.

ఉమ్మడి రాష్ట్రాన్ని బలవంతంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన తెలంగాణలోను రెండు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రాలేకపోయింది. కేంద్రంలో సంగతి సరేసరి. చిటికెన వేలుమీద ప్రభుత్వాన్ని ఆడించి, రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఆ పార్టీలోని నేతలు ఏం చేస్తున్నారు? సీనియర్ నేతలు పెద్దసంఖ్యలో ఉంటారు.. వారంతా ఎక్కడ? అనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో మిగిలిపోయారు

కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో మిగిలిపోయారు

విభజన సమయంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేసిన డ్రామాల్ని చూస్తే ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అంతగా ప్రజల్ని నమ్మించి తర్వాత ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. విభజన హామీలు రాక, వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా తాత్సార ధోరణితో ఉండటం లాంటివన్నీ రాష్ట్రాన్ని పూర్తిగా అథోగతి పట్టించాయి. విభజన సమయంలో పలువురు కాంగ్రెస్ సీనియర్లు తెలుగుదేశం, వైసీపీలోకి వెళ్లిపోయారు. రెండు పార్టీల్లో ఇమడలేనివారు, కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఉండేవారు అలాగే ఉండిపోయారు.

టీడీపీవైపు చూస్తున్న సీనియర్లు?

టీడీపీవైపు చూస్తున్న సీనియర్లు?


రఘువీరారెడ్డి, శైలజానాథ్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారు ఈ కోవలోకి వస్తారు. వరుసగా 10 సంవత్సరాలు గడిచినప్పటికీ రాజకీయంగా ఎటువంటి భవితవ్యం కనపడకపోవడంతో శైలజానాథ్, హర్షకుమార్ లాంటి నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. హర్షకుమార్ తనయుడు ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఇరువైపులా ఎవరూ ఖండించలేదు.

 రుద్రరాజుకు పదవి దక్కడంతో అసంతృప్తి

రుద్రరాజుకు పదవి దక్కడంతో అసంతృప్తి


పీసీసీ అధ్యక్ష పదవి గిడుగు రుద్రరాజుకు దక్కడంతో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు టీడీపీవైపు చూస్తున్నారు. శైలజానాథ్ పార్టీలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదు. హర్షకుమార్ కూడా పీసీసీ పదవి ఆశించినప్పటికీ దక్కకపోవడంతో ఆయన కూడా టీడీపీవైపు చూస్తున్నారు. అయితే అమలాపురం లోక్ సభ స్థానం నుంచి ఇన్ ఛార్జిగా ఉన్న బాలయోగి వారసుడు హరీష్ ను పి.గన్నవరం ఇన్ ఛార్జిగా పంపించారు. హర్షకుమార్ కోసమే హరీష్ ను గన్నవరం పంపించారంటూ ప్రచారం జరుగుతోంది. హర్షకుమార్ లేదంటే ఆయన తనయుడు శ్రీరాజ్ అమలాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీచేయబోతున్నట్లు సమాచారం. శైలజానాథ్ కు జేసీ సోదరులతో కూడా సన్నిహిత సంబంధాలుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+