వైసీపీలో చేరిన శైలజానాథ్, జగన్ హామీ - చేరికల లిస్టులో నెక్స్ట్..!!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొద్ది రోజులుగా శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ రోజు అధికారికంగా తన మద్దతు దారులతో కలిసి శైలజానాథ్ వైసీపీలో చేరారు. జగన్ రాజకీయ విధానాలు నచ్చి పార్టీలో చేరానని.. ప్రస్తుత ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని శైలజానాథ్ చెప్పుకొచ్చారు. మరి కొందరు కాంగ్రెస్ ముఖ్యులు వైసీపీలో చేరుతారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శింగనమల నుంచి శైలజానాథ్ రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గానూ వ్యవహరించారు. కొద్ది రోజులు క్రితం మాజీ సీఎం జగన్ తో శైలజానాథ్ భేటీ అయ్యారు. పార్టీలో చేరిక పైన చర్చించారు. ఈ రోజు తన అనుచరులతో కలిసి శైలజానాథ్ వైసీపీ లో చేరారు. వైసీపీ ప్రజల తరుపున పోరాడుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక మొదలైందని..ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని విమర్శించారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

తాను జగన్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని శైలజానాథ్ చెప్పారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వైసీపీలోకి వస్తారని చెప్పుకొచ్చారు. ఎవరెవరు వస్తారనేది తాను ఇప్పు డే చెప్పలేన్నారు. తనకు జగన్ ఏ బాధ్యత అప్పగించినా తన శక్తి మేరకు పనిచేస్తానని స్పష్టం చేసారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు తన వంతు పనిచేసానని వెల్లడించారు. రాజకీయాలు ప్రజా ప్రయోజ నాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కాగా, శైలజానాథ్ కు పార్టీలో కీలక పదవి ఇచ్చేందుకు జగన్ సిద్దమైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications