చంద్రబాబుకు మద్దతు కోసం ఢిల్లీలో పురందేశ్వరి ప్రయత్నం, కానీ - సజ్జల..!!

చంద్రబాబు కోసం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని పురందేవ్వరి కలిసి చంద్రబాబుకు మద్దతు కూడగట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోందని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. రూ.300 కోట్లు జేబులో వేసుకోవడానికి స్కిల్ కుట్ర జరిగిందని ఆరోపించారు. సీమెన్స్ సంస్థ కూడా తమకు సంబంధం లేదని చెప్పిందని గుర్తు చేసారు. ఈడీ నలుగురిని అరెస్ట్ చేసందని..చంద్రబాబు తప్పు చేసారని ఆధారాలు విచారణ అధికారులు సేకరించారని సజ్జల చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకు మద్దతుగా పురందేశ్వరి : వైసీపీ ముఖ్య నేత సజ్జల మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాదు, ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్నా.. బీజేపీలో ఉన్నా తన తండ్రిని అవమానించిన చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నపోటు పొడిచినా..పురందేశ్వరి మద్దతుగా నిలిచారన్నారు.

Sajjala allegated that Purandeswari working as TDP President after Chandra Babu Arrest

ఢిల్లీలో చంద్రబాబు కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోందన్నారు. కేసులు విచారణకు రాకుండా అ‍డ్డుకోవడమే చంద్రబాబుకు తెలిసిన విద్య విమ‌ర్శించారు . స్కిల్ స్కామ్‌లో సుధీర్ఘకాలం దర్యాప్తు జరిగాకే చంద్రబాబును అరెస్ట్‌ చేశార‌ని చెప్పారు. లేని ప్రాజెక్టులు ఉన్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారని ఆరోపించారు.

దేశం వదలి పారిపోయారు : సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలరని వ్యాఖ్యానించారు. పెండ్యాల శ్రీనివాస్‌, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోయారని చెప్పారు ఐటీశాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారన్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకొచ్చార‌ని చెప్పారు. ద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా అని ప్రశ్నించారు.

ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్‌ తయారు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉంద‌ని ప్ర‌శ్నించారు. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయిన తరువాత సుదీర్ఘ వాదనలు రెండు పక్షాలు విన్న తరువాత కోర్టు ఆ స్కామ్‌ జరిగిందని ప్రాథమికంగా సాక్షాధారాలు ఉన్నాయని నమ్మి రిమాండుకు పంపి నెల రోజులు అవుతుందని గుర్తు చేసారు.

Sajjala allegated that Purandeswari working as TDP President after Chandra Babu Arrest

క్వాష్ పైనే వాదనలు : టీడీపీ వాళ్లు బెయిల్‌పై మాట్లాడాలి కానీ, నెల రోజులుగా క్వాష్‌ పిటిషన్‌పైనే వాదనలు చేస్తున్నారన్నారు. కేసు విచారణకు రాకుండా స్టే తెచ్చుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచనగా పేర్కొన్నారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు గమనిస్తే ..రూ.120 కోట్లు టిడ్కో ఇళ్లలో కాంట్రాక్టులు ఇచ్చినందుకు చంద్రబాబు ముడుపులు ముట్టాయని ఆధారాలతో సహా ఐటీ శాఖ వివరించిందని చెప్పారు. గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా మేనేజ్‌ చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కానీ స్కిల్‌ స్కామ్‌లో కుదరడం లేదని పేర్కొన్నారు. నారా లోకేష్‌ ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారో తెలియదన్నారు. నోరు తెరిస్తే మమ్మల్ని ఏం పీకుతారని బెదిరింపులకు దిగుతున్నారని సజ్జల మండిపడ్డారు 73 ఏళ్ల వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడితే ఏమీ వస్తుందని ప్రశ్నించారు. లోకేష్‌ బయట తిరుగొచ్చు కదా అంటూ సజ్జల ఎద్దేవా చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+