Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటమి నైరాశ్యంలోకి టీడీపీ - రంగంలోకి బౌన్సర్లు..!!

ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్నాహ్నం 3 గంటల వరకు 55.45 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్లతో గ్రామాల్లో జాతర వాతావరణం కనిపిస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో మధ్నాహ్నం తరువాత ఓటర్ల రాక తగ్గింది. కాగా, ఎన్నికల ఘర్షణల పై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

టీడీపీ దాడులు చేస్తోంది
టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోందన్నారు. వైయస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలని సూచించారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ, బెదిరిస్తూ, దాడులకు దిగుతున్నారని మండి పడ్డారు.

Sajjala complains to EC over TDP Attacks on YSRCP cadre n Palnadu and Chittoor Dists

బౌన్సర్లను దించారు
అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీదని వ్యాఖ్యానించారు. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్ని ఈసీకి తెలిపామన్నారు.

Sajjala complains to EC over TDP Attacks on YSRCP cadre n Palnadu and Chittoor Dists

భారీ ఓటింగ్
కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని సజ్జల కోరారు. ఇక..పోలింగ్ శాతం భారీగా నమోదు అవుతుండటంతో పార్టీలు ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలిచారనే అంశం పైన లెక్కలు తీస్తున్నాయి. క్షేత్ర స్థాయి నివేదికలతో ఓటర్ పల్స్ పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. సాయంత్రి పోలింగ్ ముగిసిన తరువాత పార్టీలు తమ అంచనాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+