• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సజ్జల ఫోన్ చేసింది నిజమే-ప్రభుత్వాలు బెదిరిస్తే భయపడం : ఆర్దిక మంత్రి కనబడరు-ఏపీ ఉద్యోగ సంఘాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం పైన ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయనే అంశం పైన ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగ జేఏసీల సమావేశం సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫోన్ చేసారనే ప్రచారం పైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగులకు ఓ సందేశం ఇవ్వాలని ఏపీ జెఎసి లు కలిశాయని చెప్పుకొచ్చారు. మీడియా సమావేశానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి బెదిరించారంటూ కొందరు ప్రచారం చేసారన్నారు. ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమని చెప్పారు. కానీ ఉద్యోగులు కంట్రోల్ లో ఉండాలని చెప్పారన్న మాట అవాస్తవమని స్పష్టం చేసారు.

సజ్జల పైన ప్రచారం సరికాదు

సజ్జల పైన ప్రచారం సరికాదు

రెండు జెఎసి లు కలిసి పని చేయాలని మాత్రమే శుభాకాంక్షలు తెలిపారని శ్రీనివాస రావు వివరించారు. ఘర్షణ వాతావరణం వద్దనే చెప్పారని..మేము కూడా ఆయనకు అదే చెప్పామని స్పష్టం చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టలేదని ఆయనకు చెప్పామన్నారు. ప్రభుత్వం అంటే భయ పడటానికి, చెమటలు పట్టడానికి నేను జూనియర్ ను కాను అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వానికి తొత్తులుగా మారె పరిస్థితి లేదని స్పష్టం చేసారు.

ఇష్టం లేకే ఈ దుష్ప్రచారం

ఇష్టం లేకే ఈ దుష్ప్రచారం

కొందరు వ్యక్తులకు రెండు జెఎసి లు కలిసి పనిచేయడం ఇష్టం లేకే ఈ దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. ఇవాళ్టికీ జీతాలు, పెన్షన్లు చాలా మందికి రాలేదని వివరించారు. సచివాలయంలో ఆర్ధిక శాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి ఎవరు కనపడరని వ్యాఖ్యానించారు. కానీ తమకు ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉన్న వ్యక్తి కేవలం సజ్జల మాత్రమేనంటూ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఏ మాత్రం పట్టని కొన్ని సంఘాలు పని గట్టుకుని కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే అంశం పైన అమరావతి ఉద్యోగుల జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సైత స్పందించారు.

సమస్యలను వినే ఏకైక వ్యక్తి సజ్జల

సమస్యలను వినే ఏకైక వ్యక్తి సజ్జల

సజ్జల రామకృష్ణ రెడ్డి ఫోన్ చేసి బెదిరించారని రకరకాలుగా ప్రచారం చేశారని చెప్పారు. ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమే అని వివరించారు. ఉద్యోగుల సమస్యలను వినే ఏకైక వ్యక్తి సజ్జల అని..మళ్ళీ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకుంటే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ పై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని, ఇక ఓపిక పట్టలేమని ఆయనకు చెప్పామన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులుగా లోబడే ఉండాలని..తాము రాజకీయ పార్టీల నాయకులం కాదన్నారు.

ఇక పై పోరాడుతాం..

ఇక పై పోరాడుతాం..

అవసరం అయితే మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం ఇక పై పోరాడుతాం కూడా అని స్పష్టం చేసారు. మా జీతాలు, పెన్షన్లు రాక పోయినా మేం కష్ట కాలం లో పని చేశామన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కొందరు ఉన్నతాధికారుల పట్ల సీఎం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఆర్ధిక అంశాల పై మేం ఎక్కడా మేము ఆందోళన చెందటం లేదని స్పష్టం చేసారు.

త్వరలోనే సీఎం దగ్గర నుంచి పిలుపు..

త్వరలోనే సీఎం దగ్గర నుంచి పిలుపు..

సీపీఎస్ రద్దు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు తదితర అంశాల పై ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తమ సమస్యలు తీర్చక పోతే పోరాటానికి సమాయత్తం అవుతామని బొప్పరాజు హెచ్చరించారు.ఓ సంఘం ప్రభుత్వం తో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 10 రోజుల్లోనే అనుమతి తెచ్చుకున్న ఆ సంఘం ఉద్యోగులకు రాయితీ లు రాకుండా ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు. 11 వ పీఆర్సీ ని దసరా నాటికి ఇవ్వాలని కోరామని చెప్పారు. త్వరలోనే సీఎం దగ్గర నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నామని వివరించారు. డీఏ బకాయిలు అన్ని సంక్రాంతి నాటికల్లా చెల్లించాలని కోరామని బొప్పరాజు వివరించారు.

English summary
There is no truth in the news that Sajjala Ramakrishna Reddy had threatend the employees,clarified AP NGO President Bandi Srinivas Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X