చంద్రబాబు కుప్పం పర్యటనపై సజ్జల సెటైర్.. స్వరూపానంద క్షుద్ర పూజల వ్యాఖ్యలపై ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబుపై మండిపడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఓట్లు వేసిన కుప్పం ప్రజలను డబ్బులకు అమ్ముడు పోయారని చంద్రబాబు అవమానించారని పేర్కొన్నారు. ప్రజలు ఓట్లు వేసినప్పటికీ చంద్రబాబు అంగీకరించటం లేదని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుప్పంలో ఓటమితో చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

స్వరూపానంద స్వామిపై చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల ఫైర్

స్వరూపానంద స్వామిపై చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల ఫైర్

బాబు సంస్కారం లేకుండా, హుందాగా లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన, చంద్రబాబుపై ఫోటోలతో సహా ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. జగన్ స్వరూపానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళి ఏదో క్షుద్రపూజలు చేశారని చేసిన విమర్శలపై మండిపడిన సజ్జల రామకృష్ణారెడ్డి క్షుద్ర పూజలు చేస్తారని చంద్రబాబు చెప్పిన స్వరూపానంద స్వామి దగ్గరికి అప్పట్లో చంద్రబాబు కూడా వెళ్లారని, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ ,అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు కూడా స్వామి దగ్గరకు వెళ్లారని ఫోటోలతో సహా చూపించే ప్రయత్నం చేశారు. అనవసరంగా స్వామీజీని నిందించటం ఎందుకని అసహనం వ్యక్తం చేశారు.

జమిలి ఎన్నికల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు

జమిలి ఎన్నికల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు

ఏదైనా షాక్ తిన్నప్పుడు చంద్రబాబు పేస్ ఎలా మారిపోతుందో చెప్పిన సజ్జల అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఎలా షాక్ తిన్నారో పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు అదే విధంగా షాక్ కు గురయ్యారంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు జమిలి ఎన్నికలు అని చెప్పి టిడిపి నేతలు టిడిపిని వదిలిపెట్టకుండా చూడడం కోసం నానా తంటాలు పడుతున్నారని, కొత్త డ్రామాలాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

చంద్రబాబు కుప్పం పర్యటనపై భగ్గుమన్న వైసీపీ నేతలు

చంద్రబాబు కుప్పం పర్యటనపై భగ్గుమన్న వైసీపీ నేతలు

ఈరోజు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని, కరోనా సమయంలో కూడా జనాన్ని పట్టించుకోలేదని, పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యే సరికి కుప్పం గుర్తుకొచ్చిందా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సొంత ఇలాకాలో టిడిపిని బలహీనం చేయాలని భావించిన వైసిపి పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టింది.

మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటనపై ఆసక్తి

మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం పర్యటనపై ఆసక్తి

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కి షాక్ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గ ఫలితాల తర్వాత స్థానిక నాయకులతో మాట్లాడి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని ప్రకటించారు. చెప్పినట్టుగానే నేడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు నియోజకవర్గం లోనే ఉండి అన్ని సమస్యలను తెలుసుకోవటంతో పాటు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+