sajjala ramakrishna reddy pawan kalyan janasena chief election campaign ys jagan mohan reddy ysrcp political parties ap news ap politics పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీలు ఏపీ రాజకీయాలు politics
పవన్ కు నిలకడ లేదు .. పగలు ఒక పార్టీతో రాత్రి మరో పార్టీతో కలుస్తారు : సజ్జల ఆగ్రహం
వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన సజ్జల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పగలు ఒక పార్టీతో రాత్రి మరో పార్టీతో కలుస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ కు వైసీపీ మంత్రి కన్నబాబు చురకలు .. తిరుపతిలో వివేకా హత్య కేసుపై పవన్ వ్యాఖ్యల దుమారం

సినిమాల్లోలా రాసిన స్క్రిప్టును సభలో పవన్ చదువుతున్నారు అంటూ సెటైర్లు
బిజెపి జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఎదుర్కోలేకనే తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సొంత అభిప్రాయమంటూ ఏమీ లేదని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. సినిమాల్లోలా రాసిన స్క్రిప్టును సభలో పవన్ చదువుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. ఆర్థిక లోటు ఉన్నా హామీల అమలుకే ప్రాధాన్యత ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఏ ఒక్క అంశంలోనైనా నిలకడగా ఉన్నాడా ?
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పాలనను మెచ్చి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపికి భారీ విజయం కట్టబెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు .ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల అండదండలు మాత్రం జగన్ కి ఉన్నాయని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఏ ఒక్క అంశంలోనైనా నిలకడగా ఉన్నాడా అని ప్రశ్నించారు . 2019 ఎన్నికలకు ముందు , ఆ తర్వాత పవన్ మాట్లాడిన మాటలను పోల్చి చూస్తే ఒక్క దాంట్లోనూ స్థిరత్వం లేదన్న విషయం అర్థమవుతుందన్నారు.

పవన్ తత్వమే అంతా ?లేక సినిమాకు అనేక డైలాగులు చెప్పడం వల్ల అలా అయ్యాడా
పవన్ తత్వమే అంతా ?లేక సినిమాకు అనేక డైలాగులు చెప్పడం వల్ల తనకంటూ సొంత అభిప్రాయం లేకుండా పోయిందా ? అంటూ ప్రశ్నించారు సజ్జల.
అంతేకాదు పవన్ ఆ పూటకు స్టేజిపై ఆవేశంగా కనిపించడం కోసం ఏదో ఒకటి చెప్పడం పవన్ కళ్యాణ్ కు అలవాటు అయిపోయిందని ,ఎత్తిచూపడానికి సమస్యలేవీ లేకపోవడంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ . జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలపై సజ్జల ఫైర్
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ జగన్ నుటార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు . వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ప్రశ్నించారు . జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ కోడి కత్తి కేసు ఏమైంది అని ప్రశ్నించారు. ఎర్ర చందనాన్ని చైనాకు డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు . వైసీపీ ఎమ్మెల్యే లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలన్నారు .వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాడు మాట్లాడటానికి గొంతు కూడా రాదు అంటూ ఎద్దేవా చేశాడు. జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న పవన్ పై సజ్జల రివర్స్ అటాక్ చేశారు.