17 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న సజ్జల .. చంద్రబాబుకు షాకింగ్ న్యూస్ చెప్పారుగా !!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకింగ్ న్యూస్ చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి . టీడీపీ నుండి వైసీపీలోకి స్వచ్చందంగా వచ్చి చేరే వారు చాలా మంది ఉన్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. 13 నుండి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారు. టీడీపీ అధినేత తీరు, లోకేష్ తీరు నచ్చక చాలా మంది పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

వైసీపీలోకి కొనసాగుతున్న వలసలపై సజ్జల ఏమన్నారంటే
ఇటీవల టీడీపీ నుండి కీలక నేతలు వైసీపీలోకి వలసలు వెళుతున్న విషయం తెలిసిందే . ఇక నేడు వైసీపీలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ కూడా చేరుతున్నారు . ప్రస్తుతం కరణం బలరాం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వలసలు కొనసాగుతున్న తరుణంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి టీడీపీ నేతలను మేం ఆహ్వానించకున్నా వారంతట వారే వస్తున్నారని తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారని బాంబ్ పేల్చిన సజ్జల
టీడీపీ పుట్టి మినిగిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదని, ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కాదని ఆయన అన్నారు. అందుకే అందరూ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారని చెప్పి బాంబ్ పేల్చారు. రానున్న రోజుల్లో మరిన్ని వలసలు తమ పార్టీలోకి కొనసాగుతాయని సజ్జల పేర్కొన్నారు. ఇక టీడీపీ ఓటమి భయంతో వైసీపీ మీద బురద చాల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు.

చంద్రబాబు ఓటమి భయంతో ఆరోపణలు చేస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారు
స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగకుండా వైసీపీ అడ్డుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓడిపోతామని తెలిసే ఓటమికి సాకులు వెతుక్కుంటున్న చంద్రబాబు వైసీపీని దోషిగా చూపుతున్నారని అన్నారు. అసలు టీడీపీ నుండి నామినేషన్లు వెయ్యటానికి చాలా మంది ఇష్టపడటం లేదని, పార్టీ మారాలని చాలా చూస్తున్నారని చెప్పిన సజ్జల స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరైనా నామినేషన్ల వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటే మేం ఎస్కార్ట్ ఇచ్చి పంపుతామని పేర్కొన్నారు.

పరిమళ్ నత్వానీ టికెట్ విషయంలో మాట్లాడే హక్కు టీడీపీకి లేదు
పారిశ్రామిక వేత్త అయిన పరిమళ్ నత్వానీకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిక్కెట్ ఇచ్చామని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. టిక్కెట్లను అమ్ముకునే సంస్కృతి వైసీపీకి లేదని, అలాంటి సంస్కృతి టీడీపీదేనని అన్నారు. సుజనా, సీఎం రమేష్, గరికిపాటి, కనకమేడల వంటి వాళ్లకు రాజ్యసభ టికెట్లు ఇచ్చిన టీడీపీ ఇక మమ్మల్ని విమర్శించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి వైసీపీని విమర్శించే హక్కు లేదన్నారు.












Click it and Unblock the Notifications