డప్పు కొట్టిన కోదండ: హైదరాబాద్ హమారా (పిక్చర్స్)
హైదరాబాద్: ఈ నెల 29వ తేదిన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరగనున్న సకల జన భేరీ సభ గోడ పత్రికను తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి గురువారం ఆవిష్కరించింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వెంటనే పెట్టాలని, హైదరాబాదు తెలంగాణదేనని చెప్పేందుకు సకల జన భేరీని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు గురువారం హైదరాబాద్ సిర్ఫ్ హమారా ధర్నాలో పాల్గొన్నారు. హైదరాబాదు పైన అందరికీ హక్కుందని సీమాంధ్ర నేతలు చెబుతున్న నేపథ్యంలో వీరు అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేశారు.
మరోవైపు ఎపిఎన్జీవోలు సమైక్యాంధ్ర కోసం తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. పలువురు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఢిల్లీలో జరగనున్న సమైక్యాంధ్ర ఆందోళనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పాల్గొంటారు. ఆమె ఢిల్లీకి చేరుకున్నారు.

సకల జన భేరీ
ఈ నెల 29న హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరగనున్న సకల జన భేరీ సభ గోడ పత్రికను విడుదల చేస్తున్న న్యాయవాదులు.

కె కెశవ రావు
ఈ నెల 29న హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరగనున్న సకల జన భేరీ సభ గోడ పత్రికను విడుదల చేస్తున్న న్యాయవాదులు. పోస్టర్‌తో తెరాస సీనియర్ నేత కె కేశవ రావు.

తెలంగాణ ఉద్యోగుల సంఘం
ఈ నెల 29న హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరగనున్న సకల జన భేరీ సభ గోడ పత్రికను విడుదల చేస్తున్న ఉద్యోగుల సంఘం.

రిటైర్డ్ ఉద్యోగులు
ఈ నెల 29న హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరగనున్న సకల జన భేరీ సభ గోడ పత్రికను విడుదల చేస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్.

ఉద్యోగులు
ఈ నెల 29న హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరగనున్న సకల జన భేరీ సభ గోడ పత్రికను విడుదల చేస్తున్న ఉద్యోగుల సంఘం.

సమైక్యమే ముద్దు
హైదరాబాద్ అందరిదని, సమైక్యాంధ్ర వర్దిళ్లాలి అంటూ ఎపిఎన్జీవోలు ప్లకార్డులు పట్టుకున్న దృశ్యం. హైదరాబాదు అభివృద్ధిలో అందరి పాత్ర ఉందని, రాజధాని అందరిదని డిమాండ్ చేశారు.

కలిసుందాం
అన్నదమ్ముల్లా కలిసుందాం.. అభివృద్ధిలో దూసుకుపోదామని, జై సమైక్యాంధ్ర అంటూ ప్లకార్డులు పట్టుకున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు.

హైదరాబాద్ సిర్ఫ్ హమారా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిర్ఫ్ హమారా అంటూ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఐకాస.

హాజరైన కార్యకర్తలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిర్ఫ్ హమారా అంటూ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఐకాస నాయకులు.

నినాదాలు
హైదరాబాద్ సిర్ఫ్ హమారా అంటూ నినాదాలు చేస్తున్న తెలంగాణవాదులు. గురువారం హైదరాబాద్ సిర్ఫ్ హమారా కార్యక్రమం నిర్వహించారు.

కెటిఆర్, కోదండ
హైదరాబాద్ సిర్ఫ్ హమారా కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్.

మాట్లాడుతున్న కెటిఆర్
హైదరాబాద్ సిర్ఫ్ హమారా కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.

మాట్లాడుతున్న కోదండరామ్
హైదరాబాద్ సిర్ఫ్ హమారా కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్.

అమరవీరుల స్థూపం వద్ద
హైదరాబాద్ సిర్ఫ్ హమారా కార్యక్రమం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద డప్పు దరువుకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ తెలంగాణవాదుల హంగామా దృశ్యం.

డప్పు కొడుతున్న కోదండ, స్వామి గౌడ్
హైదరాబాద్ సిర్ఫ్ హమాకా కార్యక్రమంలో డప్పు కొడుతున్న తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్, శాసన మండలి సభ్యుడు స్వామి గౌడ్.












Click it and Unblock the Notifications