మంత్రి సునిత తల్లికి సారె, మహిళ వేషంలో శివ ప్రసాద్

మహిళ వేషధారణలో శివ ప్రసాద్
చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు శివ ప్రసాద్ బుధవారం మహిళ వేషధారణలో సమైక్యాంధ్ర కోసం నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజయనగరంలో పుట్టారని, ఆయన తన తనయుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును గుంటూరులో చదివించారని చెప్పారు.
కెసిఆర్ తన కోడలును తూర్పు గోదావరి జిల్లా నుండి తీసుకు వచ్చుకున్నారని చెప్పారు. అలాగే పలువురు మంత్రులు, ఇతర తెలంగాణ నేతలు సీమాంధ్ర నుండి వియ్యమందుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు మళ్లీ విడిపోదామని ఎలా అంటారని ప్రశ్నించారు.
అశోక్ బాబు, వంగపండులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ప్రజా గాయకుడు వంగపండులపై కేసు నమోదు చేయాలని మంగళవారం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఆదేశించింది. సమైక్యాంధ్ర కోసం ఆదివారం కర్నూలులో నిర్వహించిన సభలో అశోక్ బాబు తెలంగాణ ప్రజలను కించపర్చేలా ప్రసంగించారని, తెలంగాణవాదులను దూషిస్తూ అసభ్య పదజాలంతో కూడిన పాటలను వంగపండు పాడారంటూ న్యాయవాది భార్గవ్ సైబరాబాద్ 11న మహానగర న్యాయస్థానంలో ప్రయివేటు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications