మెగా బ్రదర్స్‌కు సమరం పంచ్: చిరంజీవి గాలి తీసి.. పవన్‌కు చురకలు

విజయవాడ : సినిమా ప్రస్థానంలో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి రాజకీయాల్లో ఎంతలా చతికిలపడిపోయారో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఆయన ప్రయాణం డిజాస్టర్‌గా మిగిలిపోవడానికి అప్పట్లో ప్రజారాజ్యం అనుసరించిన పంథాయే కారణమనే వాదన బలంగా ఉంది.

చిరంజీవి పార్టీ అనగానే ఆయనతో పాటు కలిసి నడవడానికి సిద్దమైన ఎంతోమంది ఆ తర్వాత పార్టీ అనుసరిస్తున్న విధానాలను చూసి షాక్ తిన్నారు. అందులో ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం ఒకరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చిరంజీవి రాజకీయ ప్రస్థానాన్ని తీసికట్టుగా మాట్లాడిన సమరం.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కూడా వదిలిపెట్టలేదు.

Samaram punch to mega brothers chiru and pawan

విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సమరం.. ఇద్దరు మెగా బ్రదర్స్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'కాపులంతా చిరంజీవి వెనుక నిలబడ్డప్పుడే ఆయన ఏమి చేయలేకపోయారు. కొత్తవాళ్లను, అభిమానులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తాడనుకుంటే.. మళ్లీ జంప్ జిలానీలకే టికెట్లు ఇచ్చి ఓడిపోయారు' అని మండిపడ్డారు.

ప్రజారాజ్యం నుంచి నిజాయితీపరులకు టికెట్లు దక్కుతాయని ఆశిస్తే.. ఒక్కొక్కరి వద్ద రూ.3కోట్ల నుంచి రూ.6కోట్లు వసూలు చేయడానికి సిద్దపడారని చిరంజీవిని దుయ్యబట్టారు. అందువల్లే ప్రజారాజ్యం పార్టీ నిండా మునిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇక పవన్ గురించి ప్రస్తావిస్తూ.. అప్పట్లో చిరంజీవి వల్లే కాలేదు ఇక పవన్ నుంచి ఏమవుతుంది? అని ప్రశ్నించారు.

జనసేన రాజకీయాలను ఎద్దేవా చేస్తూ.. అసలు జనసేన పార్టీ అంటేనే ఏమి అర్థం కాకుండా పోయిందని, అభిమానులంతా ఈలలేయడానికి, గోల చేయడానికి పనికి వస్తారు తప్ప ఓట్లేయడానికి పనికిరారు అంటూ చివరలో పవన్ కళ్యాణ్‌కు పంచ్ ఇచ్చారు సమరం. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని పరోక్షంగా పవన్‌కు హితవు పలికారు. పవన్ వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగిందేమి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

పొలిటికల్ గా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న పవన్ కళ్యాణ్ కు ఈ కామెంట్స్ ఒక సవాల్ లాంటివే. అప్పటి తన అభిమాన ఘనాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో చిరంజీవి పూర్తిగా విఫలమయ్యారు. జనసేనను పరోక్ష రాజకీయాకలకు కాకుండా ప్రత్యక్ష రాజకీయ బరిలో నిలపాలని పవన్ గనుక భావిస్తే.. అభిమానులను, మద్దతుదారులను ఓట్లుగా మలుచుకోవడంలో ఎంతమేర సఫలమవుతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఏదేమైనా మెగా బ్రదర్స్ కు సమరం అంటించిన చురకలు ప్రస్తుతం అందరి నోటా హాట్ టాపిక్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+