ఏపీ పంట పండింది... మరో రెండు వచ్చాయి

దీపావళి, ఛత్ పండగలను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నాలుగు రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ లోని సనత్ నగర్ నుంచి సంత్రాగచ్చి వరకు, సనత్ నగర్ నుంచి బెంగళూరుకు ఇవి నడుస్తాయి. పండగలను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 800కు పైగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆరువేలకు పైగా ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ప్రయాణికులను చేరవేసే 13.600 రైళ్లకు ఇవి అదనం. ఈ రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని, ప్రయాణికులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

సనత్ నగర్ నుంచి సంత్రాగచ్చికి 07069 పేరుతో ఈనెల 30 నుంచి వచ్చే నెల ఆరోతేదీ వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. బుధవారాల్లో ఉదయం 6.20 గంటలకు సనత్ నగర్ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది. మార్గమధ్యంలో బుధవారం రాత్రి 8.55 గంటలకు దువ్వాడ, 10.03 గంటలకు విజయనగరం, 11.10 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయి.

sanathnagar to santragachi special trains from october 30th

సంత్రాగచ్చి నుంచి సనత్ నగర్ కు బయలుదేరే 07070 రైలు ఈనెల 31వ తేదీ నుంచి నవంబరు ఏడోతేదీ వరకు అందుబాటులో ఉంటాయి. గురువారాల్లో సాయంత్రం 5.25 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి రెండోరోజు రాత్రి 11.50 గంటలకు సనత్ నగర్ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు ఖరగ్ పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్ పూర్ రోడ్, బ్రహ్మపూర్ రోడ్, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, అంకపల్లె, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, ఘట్ కేసర్, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లల్లో సెకండ్ ఏసీ 2, థర్డ్ ఏసీ 6, స్లీపర్ , జనర్ 3, దివ్యాంగులకు 1, మోటార్ కార్ 1 ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+