ఆర్‌కే బీచ్‌లో నల్లగా మారిన ఇసుక.. విశాఖవాసుల ఆందోళన; భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలోని ఆర్‌కే బీచ్ లో ఇసుక రంగు మారింది. విశాఖ నగరంలోని 35 కిలోమీటర్ల సాగరతీరంలో బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక ఇప్పుడు నల్లగా కనిపిస్తుంది. కోస్టల్ బ్యాటరీ నుండి వుడా పార్క్ మధ్య సముద్రతీరం నల్లగా మారడంతో విశాఖ వాసులు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.
Recommended Video


ఆర్‌కే బీచ్ లో నల్లగా మారిన ఇసుక
విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది సాగరతీరం.. అందునా ఆర్‌కే బీచ్. నగరానికి వచ్చే పర్యాటకులు సముద్ర అందాలను ఆస్వాదించాలంటే ఆర్‌కే బీచ్ కు తప్పనిసరిగా వస్తారు. నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే మొట్టమొదటి బీచ్ ఆర్‌కే బీచ్. ఎప్పుడూ జనసందోహంతో కోలాహలంగా ఉండే ఈ ఆర్‌కే బీచ్ లో ఇసుక బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉండేది. అయితే తాజాగాఆర్‌కే బీచ్ లోని ఇసుక నల్లగా మారిపోయింది.

విశాఖ నగర వాసుల ఆందోళన
ఇసుక నల్లగా మారడాన్ని చూసి సందర్శకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సముద్రంలో ఏం జరిగిందో , ఇసుక ఎందుకు నల్లగా మారిందో అర్థం కాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సముద్ర తీరం వైపు వెళ్ళడానికి భయపడుతున్నారు. తాము ఇసుక నల్లగా మారడాన్ని ఇప్పటివరకు చూడలేదని, ఇదేమైనా ప్రమాదానికి సంకేతమా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లటి ఇసుక సముద్ర తీరానికి కొట్టుకు రావడం వెనుక సముద్రగర్భంలో ఏదైనా అసాధారణ ఘటన సంభవించిందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి.

ఇసుక నల్లగా మారటంపై ఆంధ్రా వర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం క్లారిటీ
అయితే సాధారణంగా విశాఖ ఆర్‌కే బీచ్ నుండి మధ్య ఇసుక నల్లగా మారే స్పాట్ లు చాలానే ఉన్నాయని ఆంధ్రా యూనివర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం తెలుపుతోంది. సీజన్ మారినప్పుడు సముద్రంలో బలమైన అలజడి చోటుచేసుకునే నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఆందోళన కలిగించే స్థాయిలో నల్లటి ఇసుక సముద్ర తీరానికి కొట్టుకు రావడం వెనుక కారణాలను ఆంధ్ర యూనివర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం విశ్లేషించింది. సముద్ర వాతావరణాల్లో సంభవించే మార్పులు, అలల ఉధృతి కారణంగా ఇలా నల్లటి ఇసుక మేటలు వేసే పరిస్థితి ఉంటుందని పేర్కొంది.

ఇసుక నల్లగా మారటంపై వెనుక రీజన్ ఇదే
ముఖ్యంగా జూలై నుంచి అక్టోబర్ నెలల మధ్య కాలంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి అని చెబుతున్నారు. తీరం వద్ద లోతు ఎక్కువగా ఉన్నచోట్ల సముద్రం కోతకు గురవుతుందని, ఇక డ్రెడ్జింగ్ వల్ల కూడా సముద్ర తీరం కోతకు గురవుతుందని ఇలా కోతకు గురయ్యే సమయంలో స్పెసిఫిక్ గ్రాఫిటీ ఎక్కువగా ఉన్న ఇసుక ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో అక్కడ ఇసుక నల్లగా కనిపిస్తుందని చెప్తున్నారు.

తీరాల్లో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ .. ఆందోళన అవసరం లేదు
ఇది తీరాల్లో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ అని దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సముద్ర తీరం వద్ద గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆటుపోట్లు అధికంగా ఉన్నప్పుడు హైలెవల్ మినరల్స్ తీరానికి కొట్టుకు వస్తాయని, అవి ఇసుకతో చర్య పొందినప్పుడు ఇసుక నల్లగా మారుతుంది అని చెబుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications