గంధం చెక్కల అక్రమ రవాణా: ముఠా అరెస్టు (పిక్చర్స్)

హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా గంధం దుంగలను సరఫరా చేస్తన్న ఓ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హైదరాబాదులోని పహడీషరీప్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందన అబ్దుల్లా (60), మునీరుద్దీన్ (65)లు కలిసి హైదరాబాద్ నగర శివారులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థావరంపై పోలీసులు దాడి చేసి ముఠా సభ్యులను పట్టుకున్నారు.

నగరంలో తమ వ్యాపార లావాదేవీలు కొనసాగించేందుకు పహడీషరీప్ ప్రంతానికి చెందిన జయంత్ గౌడ్, అబ్దుల్లాలను నియమించుకున్నారు వారి ద్వారా గంధం దుంగలను అమ్మకానికి పెట్టి వాటిని కావలసినవారికి చేరవేసేవారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని గంధం చెక్కలను అమ్మకాలు సాగించే వారి నుంచి సేకరించి పహడీషరీప్ ప్రాంతంలోని షాహీన్‌నగర్‌లో నిల్వచేసేవారు. నగరంతో పాటు ముంబై, ఢిల్లీల్లో వినియోగదారులకు గంధం చెక్కలను సరఫరా చేసేవారు.

గంధం చెక్కల అక్రమ రవాణా

గంధం చెక్కల అక్రమ రవాణా

లాల్ అహ్మద్ (29), నిజామాబాద్‌కు చెందిన మరికెళ కృష్ణ (50), అంజయ్య (40)ల ద్వారా గంధం చెక్కలను దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించేవారు.

గంధం చెక్కల అక్రమ రవాణా

గంధం చెక్కల అక్రమ రవాణా

కొంత కాలంగా షాహిన్‌నగర్‌లో గంధం దుంగల వ్యాపారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వారి స్థావరాలపై దాడి చేశారు.

గంధం చెక్కల అక్రమ రవాణా

గంధం చెక్కల అక్రమ రవాణా

గంధం చెక్కలను నిల్వ చేసిన స్థావరాలపై పోలీసులు దాడులు చేసి దాదాపు 25 కిలోలకు పైగా గంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు.

గంధం చెక్కల అక్రమ రవాణా

గంధం చెక్కల అక్రమ రవాణా

నిందితుల నుంచి పోలీసులు రూ. 3.80 లక్షల నగదు, రూ.1.5 లక్షల విలువ చేసే గంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు.

గంధం చెక్కల అక్రమ రవాణా

గంధం చెక్కల అక్రమ రవాణా

పక్కా సమాచారంతో హైదరాబాదులోని పాతబస్తీలోని స్థావరాలపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నరాు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+