ట్విస్ట్: ఉదయ్ కిరణ్ సూసైడ్‌పై సంగీత, అంతే చెప్పాడు

డబ్బు చెల్లించాలని తాను ఎప్పుడు కూడా ఉదయ్ పైన ఒత్తిడి చేయలేదని తెలిపారు. తనకు చిత్తూరు జిల్లా కుప్పంలో చీరల దుకాణం ఉందని, ఇటీవల ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు మున్నా పరిచయమయ్యాడని, అప్పుడు అతను డామిట్ కథ అడ్డం తిరిగింది నిర్మిస్తున్నట్లు తనకు చెప్పాడని, అంతేకాకుండా తన చీరల దుకాణం నుండి కాస్ట్యూమ్స్ కావాలని మున్నా అడిగాడని ఆమె తెలిపారు.
ఈ చిత్రంలో సహ నిర్మాతగా తన పేరు వేస్తానని మున్నా నమ్మించాడని, దీంతో తెలిసిన వారి నుండి వడ్డీకి డబ్బును తెచ్చి మున్నాకు పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చానని సంగీత చెప్పారు. డబ్బులు తీసుకోవడానికి ముందు మున్నా ఉదయ్‌తో ఫోన్లో మాట్లాడించాడని తెలిపారు.
మూడు నెలల్లో డబ్బు తిరిగి ఇస్తానని చెప్పిన మున్నా.. అయిదు నెలలు కావొస్తున్నా ఇవ్వలేదని, ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. తనకు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారని, వడ్డీతో కలిపి పది లక్షలు పెరిగిందని, మున్నా కార్యాలయానికి వెళ్తే తాళం వేసి ఉందన్నారు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఉదయ్ కిరణ్ ఇంటికి వెళ్లానని సంగీత తెలిపారు.
ఓసారి వెళ్తే చెన్నైలో ఉన్నారని, మరోసారి వెళ్లినప్పుడు బయట నిలబెట్టి మాట్లాడారని, ఉదయ్ కిరణ్ తనకు ధైర్యం చెప్పారని, ఆ తర్వాత అతనిని కలిసింది లేదన్నారు. విషిత తనను ఇంత వరకు చూడలేదని, ఫైనాన్షియర్ ఒత్తిళ్ల వల్ల అని ఎందుకు వార్తలు వస్తున్నాయోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను అఖిల భారత మానవ హక్కుల సంస్థ మాజీ చీఫ్ సహాయంతో బయటపడ్డానని, మున్నా మంచివాడని మాత్రమే ఉదయ్ కిరణ్ చెప్పారని, అంతకుమించి హామీ ఇవ్వడం లేదా ప్రమిసరీ నోటు రాసివ్వడం చేయలేదన్నారు. అలాంటప్పుడు ఆయన పైన తాను ఒత్తిడి ఎందుకు చేస్తానని అన్నారు. మున్నాననే నమ్మించి మోసం చేశాడన్నారు.












Click it and Unblock the Notifications