వీడియో: సత్తెనపల్లి సెంటర్‌లో..

Ambati Rambabu dance: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ కోలాహలం నెలకొంది. ఇప్పటికే నగరాలు ఖాళీ అయ్యాయి. హైదరాబాదీయులు ఏపీ వైపు పరుగులు తీశారు. ఈ పండగను తమ ఆత్మీయుల మధ్య జరుపుకొంటోన్నారు. భోగీ మంటలు, సంక్రాంతి ముగ్గులతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. సరికొత్త కళను సంతరించుకున్నాయి.

Recommended Video

    Bhogi Celebrations లో ఆకట్టుకున్న Ambati Rambabu Traditional Dance | Telugu Oneindia

    హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. నగరవాసులు ఈ పండగను తమ ఆత్మీయుల మధ్య జరుపుకొంటోన్నారు. సంక్రాంతి పండగలో భాగంగా భోగి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోన్నారు. ఈ తెల్లవారు జామునే భోగీ మంటలను వెలిగించారు. పాత సామాగ్రిని అందులో వేసి, తగులబెడుతున్నారు.

    Sankranthi 2024: Minister Ambati Rambabu dance during the Bhogi celebrations

    పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో భోగీ సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద సందడి నెలకొంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భారీగా అంబటి నివాసానికి చేరుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఇదివరకట్లాగే భోగి మంటల చుట్టూ డాన్స్ చేశారు అంబటి రాంబాబు. సత్తెనపల్లి సెంటర్‌లో లంబాడీ మహిళలతో కలిసి అంబటి డాన్స్ చేశారు. గత ఏడాది ఇదే భోగి పండగకు ఆయన వేసిన స్టెప్స్.. ఏ రేంజ్‌లో వైరల్‌గా అయ్యాయో తెలిసిన విషయమే. లంబాడీ మహిళలతో కలిసి భోగి మంటల చుట్టూ అంబటి చేసిన డాన్స్.. కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారిందప్పట్లో.

    Sankranthi 2024: Minister Ambati Rambabu dance during the Bhogi celebrations

    రాజకీయంగానూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి- బ్రో సినిమాలో ఆయన డాన్స్‌పై స్పూఫ్ వేసే పరిస్థితి ఏర్పడిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటినేవీ లెక్కపెట్టలేదు అంబటి రాంబాబు. ఈ భోగి పండగకూ ఆయన డాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+