బ్రో 2 తీస్తావా పవన్ బ్రో: పండగ పూట భారీ ట్రోలింగ్స్
Ambati Rambabu dance: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ కోలాహలం నెలకొంది. ఇప్పటికే నగరాలు ఖాళీ అయ్యాయి. హైదరాబాదీయులు ఏపీ వైపు పరుగులు తీశారు. ఈ పండగను తమ ఆత్మీయుల మధ్య జరుపుకొంటోన్నారు. భోగీ మంటలు, సంక్రాంతి ముగ్గులతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. సరికొత్త కళను సంతరించుకున్నాయి.
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో భోగి సెలబ్రేషన్స్ హైలైట్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసాని తన డాన్స్ టాలెంట్‌ను చూపించారు. ఇదివరకట్లాగే భోగి మంటల చుట్టూ డాన్స్ చేశారాయన. సత్తెనపల్లి గాంధీ బొమ్మ సెంటర్‌లో లంబాడీ మహిళలతో కలిసి అంబటి డాన్స్ చేశారు.

గత ఏడాది ఇదే భోగి పండగకు ఆయన వేసిన స్టెప్స్.. ఏ రేంజ్‌లో వైరల్‌గా అయ్యాయో తెలిసిన విషయమే. లంబాడీ మహిళలతో కలిసి భోగి మంటల చుట్టూ అంబటి చేసిన డాన్స్.. కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారిందప్పట్లో. రాజకీయంగానూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/Tmtt5TDLMP
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2024
చివరికి- బ్రో సినిమాలో ఆయన డాన్స్‌పై స్పూఫ్ వేసే పరిస్థితి ఏర్పడిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటినేవీ లెక్కపెట్టలేదు అంబటి రాంబాబు. ఈ భోగి పండగకూ ఆయన డాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. తనపై చెలరేగిన విమర్శలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
అంబటి రాంబాబు వేసిన డాన్స్ మూమెంట్స్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఇరుకున పెట్టినట్టయింది. వైఎస్ఆర్సీపీ అభిమానులు, అంబటి అనుచరులు సోషల్ మీడియా వేదికగా పవన్‌పై భారీగా ట్రోల్స్‌కు దిగారు. ఈ సంక్రాంతి పండగ ఉత్సాహాన్ని వాళ్లు నీరుగార్చినట్టయింది.

దీనికి కారణం లేకపోలేదు. గత సంక్రాంతి నాడు అంబటి వేసిన స్టెప్స్‌ను తన బ్రో సినిమాలో స్పూఫ్‌గా పెట్టారు పవన్. ఓ పబ్‌లో చిత్రీకరించిన సన్నివేశంలో నటుడు పృథ్వీతో ప్రత్యేకంగా డాన్స్ చేయించే సీన్‌ను దగ్గరుండి రాయించారు. అంబటిని కించపరిచేలా ఆ సీన్‌ను తెరకెక్కిందంటూ అప్పట్లో విమర్శలొచ్చాయి.
ఆ విమర్శలను పట్టించుకోని అంబటి రాంబాబు ఇప్పుడు కూడా భోగి పండగ సందర్భంగా మళ్లీ స్టెప్స్ విరగదీశాడు. దీనితో- పవన్ కల్యాణ్ బ్రో 2 సినిమా తీస్తాడేమోనంటూ సెటైర్లు వేస్తోన్నారు అభిమానులు. అంబటిని కించపరిచే సీన్స్ పెట్టడానికి బ్రో 2 తీస్తావా పవన్ బ్రో అంటూ ట్రోల్స్ పోస్ట్ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications