సంక్రాంతికి రోల్స్ రాయిస్‌లో అల్లుడి గ్రాండ్ ఎంట్రీ: మైండ్ బ్లాక్ అయ్యే కారు రేట్
Rolls Royce: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ కోలాహలం నెలకొంది. ఇప్పటికే నగరాలు ఖాళీ అయ్యాయి. హైదరాబాదీయులు ఏపీ వైపు పరుగులు తీశారు. ఈ పండగను తమ ఆత్మీయుల మధ్య జరుపుకొంటోన్నారు. భోగీ మంటలు, సంక్రాంతి ముగ్గులతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. సరికొత్త కళను సంతరించుకున్నాయి.
సంక్రాంతి పండగకు అల్లుళ్లు.. అత్తవారింటికి రావడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. అల్లుళ్లకు తమ మర్యాదలతో ఉక్కిరిబిక్కరి చేస్తుంటారు అత్తారింటోళ్లు. గత సీజన్‌లో అత్తారింటివారు కొత్త అల్లుడికి చేసిన మర్యాదలు.. ఇప్పటికీ మర్చిపోవట్లేదు ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు.

సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి 173 వంటకాలతో మర్యాద చేశారు. అప్పట్లో ఆ విందు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తటవర్తి బద్రి, సంధ్య అల్లుడు పృధ్వీ గుప్తాకు ఇచ్చిన మర్యాద అది. పెళ్లి తరువాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి 173 వంటకాలతో మర్యాద చేశారు.
సంక్రాంతికి రోల్స్ రాయిస్‌లో అల్లుడి గ్రాండ్ ఎంట్రీ: మైండ్ బ్లాక్ అయ్యే కారు రేట్..!#Sankranti2024 #HappyBhogi #RollsRoyce #Oneindiatelugu + pic.twitter.com/W3vkQHb5QW
— oneindiatelugu (@oneindiatelugu) January 14, 2024
ఇప్పుడు తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి ఆ అల్లుడు రోల్స్ రాయిస్ కారులో ఎంట్రీ ఇవ్వడమే దీనికి కారణం. గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారులో ఊరికి వచ్చిన అల్లుడికి గ్రాండ్‌గా వెల్కమ్ పలికారు ఆయన బంధువులు.

బాణాసంచా కాల్చారు. స్వీట్లను పంచిపెట్టారు. ఆ కారు ధర 12 కోట్ల రూపాయలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ రేంజ్ కారును వాడుతున్నారు. ఆదిత్యరామ్ మూవీస్ అధినేత ఆదిత్యరామ్‌గా చెబుతున్నారు. అమలాపురం వీధుల్లో రోల్స్ రాయిస్ కారు పరుగులు పెట్డడం అందరినీ ఆకర్షించింది. కారుతో సెల్ఫీ దిగారు.












Click it and Unblock the Notifications