గోదారోళ్ల మర్యాదా మజాకా - అల్లుడికి పండుగ "స్పెషల్" విందు: చూడాల్సిందే..!!
సంక్రాంతి అంటే గర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. కోడి పందేలకు కేరాఫ్ అడ్రస్. పొరుగు రాష్ట్రాల ప్రజల సండది గోదావరి జిల్లాల్లో మామూలుగా లేదు. అన్ని రంగాల ప్రముఖులు కోడి పందాలు చూసేందుకు బంధువల ఇళ్లకు తరలి వచ్చారు. హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అయింది. ఇక.. ఎడ్ల పోటీలు..కోడి పందాల సందడి ఒక రేంజ్ లో కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా ఈ సారి కోలాహలం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో ఇక.. గోదావరి జిల్లాల మర్యాద కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గోదావరి అల్లుడికి సంక్రాంతి విందు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విందుకు అంత ప్రత్యేకత ఉంది.
మర్యాదలు గురించి మాట్లాడితే గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలే. అందునా భీమవరం కు ఉన్న గుర్తింపే వేరు. కొత్త అల్లుడు వస్తే గోదావరి లో సందడే వేరు. ఇప్పుడు సంక్రాంతి వేళ కొత్త అల్లుడికి చేసిన మర్యాదలు..ఏర్పాటు చేసిన విందు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లుడు కు తమ ప్రతిష్ఠకు తగినట్లుగా విందు ఏర్పాటు చేసారు. వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు ఇటీవలే తమ కుమార్తె హారికను పృధ్వీ గుప్తాకిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండుగ సంక్రాంతి కావడంతో అల్లుడు ఇలా 173 వంటకాలతో మర్యాద చేశారు. ఆ విందు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఇక..రెండు రోజులుగా గోదావరి జిల్లాల్లో ఎక్కడా చూసినా కోడి పందాల బరిలు కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో పందాలు కడుతున్నారు. ద్విచక్ర వాహనాల నుంచి లక్షలాది రూపాయాల పందాలు జరుగుతున్నాయి. కోడి పందాల విషయంలో రాజకీయాలకు అతీతంగా నేతలంతా ఒక్కటవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు..పొరుగు రాష్ట్రాలకు చెందిన నేతలు గోదావరి జిల్లాలకు చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే గోదావరి జిల్లాల్లో కొత్త అల్లుడి కోసం సిద్దం చేసిన విందు పండుగ నాడు అందరినీ ఆకట్టుకుంటోంది.
కొత్త అల్లుడుకి 173 రకాల వంటకాలు..మర్యాదలకు పుట్టినిల్లు భీమవరం..!!#Bhimavaram #AndhraPradesh #Sankranthi2023 #Oneindiatelugu pic.twitter.com/14paFuZTh3
— oneindiatelugu (@oneindiatelugu) January 16, 2023












Click it and Unblock the Notifications