ఏపీ హైకోర్టుకు సెలవులు: తేదీలు ఇవే- అత్యవసర విచారణకు జస్టిస్ బట్టు దేవానంద్ బెంచ్..!!
అమరావతి: ఏపీ హైకోర్టు సంక్రాంతి సెలవుల్లో వెళ్లనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. సెలవుల్లో ఒక డివిజన్ బెంచ్, ఇంకో సింగిల్ జడ్జ్ బెంచ్ మాత్రమే కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఈ సెలవుల సమయంలో మొత్తంగా ముగ్గురు న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారు. అత్యవసరంగా విచారించాల్సిన పిటీషన్లు ఈ డివిజన్, సింగిల్ జడ్జి బెంచ్ సమక్షానికి వస్తాయి. ఈ బెంచ్ లు కూడా రెండు రోజులు విధుల్లో ఉంటాయి.
ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏపీ హైకోర్టుకు సెలవును ప్రకటించారు. 9, 17వ తేదీలుగా కూడా సెలవులే. అంటే- చివరిగా 8వ తేదీ హైకోర్టు సమావేశమౌతుంది. ఆ రోజున లిస్టింగ్ చేసిన పిటీషన్లపై విచారణను చేపడుతుంది. 9వ తేదీ నుంచి సెలవుల్లోకి వెళ్తుంది. మళ్లీ 18వ తేదీన తన కార్యకలాపాలను మొదలు పెడుతుంది.

ఈ మధ్యలో- విచారణ దశలో ఉన్న పిటీషన్లపై హైకోర్టు రెండు రోజుల పాటు సమావేశమౌతుంది. 10, 12 తేదీల్లో హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక డివిజన్ బెంచ్, ఒక సింగిల్ జడ్జి బెంచ్ అందుబాటులో ఉంటాయి. డివిజన్ బెంచ్ లో జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డాక్టర్ వీఆర్‌కే కృపా సాగర్ ఉన్నారు. సింగిల్ జడ్జి బెంచ్ లో జస్టిసు సుబ్బారెడ్డి సత్తి విధులకు హాజరవుతారు. ఈ సంక్రాంతి సెలవుల్లోనే- అవసరం అనుకుంటే ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ప్రత్యేకంగా మరో డివిజన్ బెంచ్ ను ఏర్పాటు చేస్తుంది హైకోర్టు.
సమక్షానికి వచ్చిన పిటీషన్లపై విచారణను ముగించిన తరువాత- సింగిల్ జడ్జి బెంచ్ పిటీషన్లను విచారణకు స్వీకరిస్తుంది డివిజన్ బెంచ్. అంశాలవారీగా దాఖలైన పిటీషన్లపై విచారణను చేపట్టడానికి సీనియర్ న్యాయమూర్తులను అపాయింట్ చేస్తుంది హైకోర్టు. ఏవైనా హౌస్ మోషన్ పిటీషన్స్ దాఖలైతే వాటిని సీనియర్ వెకేషన్ ఆఫీసర్ ద్వారా సీనియర్ వెకేషన్ న్యాయమూర్తి సమక్షానికి తీసుకెళ్తారు.












Click it and Unblock the Notifications