నాకు అనుభవం లేదు, పవన్ కళ్యాణ్ పిలిస్తే మాత్రం వెళ్తా: నటుడు సప్తగిరి

హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీలోకి తాను అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తే, ఆయన ఆహ్వానిస్తే తాను ఆ పార్టీలో చేరుతానని ప్రముఖ నటుడు, కమెడియన్ సప్తగిరి అన్నారు. ఆయన నటించిన సప్తగిరి ఎల్ఎల్‌బి చిత్రం విజయవంతమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటించారు. చిత్తూరులో ఎమ్మెస్సార్ థియేటర్‌ను చిత్ర యూనిట్ సందర్శించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనకు తానుగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.

తమ్ముడు నేనున్నానంటూ పవన్ అభయం

తమ్ముడు నేనున్నానంటూ పవన్ అభయం

పవన్ కళ్యాణ్ గురించి ఏం చెబుతారు అని విలేకరులు.. సప్తగిరిని ప్రశ్నించారు. దానికి సమాధానం చెబుతూ.. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని చెప్పారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లిన వ్యక్తి హీరో అవుతున్నాడటం.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చి తమ్ముడు నేను నీకున్నానని అభయం ఇచ్చాడని వ్యాఖ్యానించారు.

అనుభవం లేదు కానీ, పవన్ అడిగితే మాత్రం

అనుభవం లేదు కానీ, పవన్ అడిగితే మాత్రం

ఈ సందర్భంగా విలేకరులు.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తారా అని ప్రశ్నించారు. దానికి సప్తగిరి స్పందిస్తూ.. రాజకీయాలపై తనకు అంత అనుభవం లేదన్నారు. అయితే పవన్ వెంట ఉండేందుకు తాను సిద్ధమని చెప్పారు. పవన్ పిలిస్తే వంద శాతం వెళ్తానని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం

పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం

హీరోగా తన తొలి చిత్రం సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ వచ్చి ఆశీర్వదించారన్న విషయాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని సప్తగిరి చెప్పారు. కాగా, సప్తగిరి చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్‌కు మద్దతు

పవన్ కళ్యాణ్‌కు మద్దతు

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు మద్దతిచ్చేందుకు సినీ తారలు చాలామంది సిద్ధంగా ఉన్నారు. నిజ జీవితంలో ఆయన తీరును బట్టి ఆయనకు మద్దతు పలికేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. సప్తగిరి కూడా పిలిస్తే కచ్చితంగా జనసేనకు అండగా ఉంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+