చిరంజీవికి పవన్ కళ్యాణ్ కౌంటర్: ప్రశ్నిస్తే తప్పించుకున్న జనసేన చీఫ్!
హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల సందర్భంగా రాజకీయాల పైన 'అన్నయ్య' చిరంజీవి పరోక్షంగా వ్యాఖ్యానించగా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేరుగానే స్పందించారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి చేరారు. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలబడ్డారు. అయితే ఆ పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో కలిపారో.. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అన్నయ్యకు రాజకీయంగా దూరం జరిగారు.
అప్పటి నుంచి వారు కలుసుకోకపోవడం, వారి మధ్య రాజకీయ విభేదాలున్నాయనే చర్చ జోరుగా సాగిన విషయం తెలిసిందే. మెగా కుటుంబ సభ్యుల పలు ఆడియో ఫంక్షన్లకు కూడా పన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం ఆ ఊహాగానాలకు మరింత ఊపు తెచ్చింది.
ఇప్పుడు చిరు, పవన్‌లు ఓకే వేదికపై కనిపించడం మెగా అభిమానులకు పండుగేనని చెప్పవచ్చు. అయితే, అదే సమయంలో రాజకీయంగా చిరంజీవి స్పందించడం, దానికి పవన్ కళ్యాణ్ సూటిగా సమాధానాలు చెప్పడం గమనార్హం. ఇది ఇప్పుడు చర్చనీయాంశమయింది.

నాడు, నేడు సలహా ఇచ్చా
చిరంజీవి మాట్లాడుతూ... తాను, పవన్ కళ్యాణ్ వదిన (చిరంజీవి సతీమణి) ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్‌కు నాడు సినిమాలలోకి వెళ్లాలని సలహా ఇచ్చామని, ఈ రోజు కూడా మరో సలహా ఇస్తున్నానని.. సినిమాలు, రాజకీయాల్లో (పరోక్షంగా) కొనసాగాలని సూచించారు.

అది కష్టించిన వాసన
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు తల్లి, తండ్రి తర్వాత అన్నా వదినలేనని, వారు అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పారు. అన్నయ్య పైన ప్రేమను అందరి ముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. చిరంజీవి సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో.. అన్నయ్య షూటింగ్‌కి వెళ్లి రాత్రి ఎప్పుడో వచ్చేవారని, కనీసం తన షూలు కూడా విప్పుకోలేనంతగా అలసిపోయేవారన్నారు. అప్పుడు నేను ఆ షూలు విప్పేవాడినని, అప్పుడు ఆ సాక్స్‌ల చెమట వాసన తనకు కంపుగా అనిపించేది కాదని, సువాసనగా అనిపించేదని, ఎందుకంటే, కష్టంతో తడిసిన సాక్స్‌లు అవి అన్నారు.

అవసరం వచ్చినప్పుడు అండగా ఉంటా
అవసరం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు తాను తన అన్నయ్యకు ఎలా అండగా నిలబడగలనో తనకు తెలుసునని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ పరమైన కామెంట్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎందులోనైనా రాణిస్తావ్
చిరంజీవి మాట్లాడుతూ... రాజకీయాలంటూ ప్రత్యేకంగా ప్రస్తావించకుండానే జోడు గుర్రాలపై పయనించాలని పవన్ కళ్యాణ్‌కు సలహా ఇచ్చారు. రెండింటిలోను పవన్ ఉన్నత శిఖరాలకు చేరుతాడని చెప్పారు. రాజకీయాల కోసం సినిమాలను పక్కన పెట్టవద్దని, అభిమానులను నిరాశపరచవద్దని చెప్పారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడలేదనే చెప్పవచ్చు.

సమాధానం చెప్పని పవన్ కళ్యాణ్
సినిమాలు వదిలేయకుండానే రెండో రంగంలోనూ పని చేయాలని చిరంజీవి అన్నారు. సినిమాలను పక్కన పెట్టడంపై సమాధానం చెప్పకపోయినప్పటికీ.. తన రాజకీయ రంగ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

రాజకీయం వేరు
తాను చేసిన పని చిరంజీవికి నచ్చలేదని, తన దారిలో తాను వెళ్లానని, రాజకీయాలు వేర్వేరు వ్యక్తిగతమైన ప్రేమలు వేరు అని పవన్ చెప్పారు. తాను ఎందుకు చేశానో అన్నయ్యకు చెప్పానన్నారు.

అందరూ ఎదగాలి
బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిందని, బాహుబలి రికార్డులను సర్దార్ గబ్బర్ సింగ్ బద్దలు కొట్టాలని, ఈ సినిమా రికార్డులు మరొకరి సినిమా బద్దలు కొట్టాలని, అందరు ఎప్పుడు ఎదగాలని చిరంజీవి చెప్పారు. తర్వాత మాట్లాడిన పవన్ స్పందిస్తూ... తన సినిమాలతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటానని అభిప్రాయపడ్డారు.

ఏదో ఒకటి చేయాలనే
నేను, వదిన పవన్ కళ్యాణ్‌కు సలహాలు ఇచ్చామని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్.. నేను ఏ పని చేయకుండా తింటున్నందుకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో తనకు అన్నవదినలు తన భవిష్యత్తు కోసం సూచన చేసినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications