ఆ ఒక్క ఫోటో టీడీపీ పరువు తీసిందా! సోషల్ మీడియాలో జోరుగా సెటైర్లు..

విజయవాడ : టీడీపీ తరుపున ఏ కార్యక్రమం నిర్వహించినా.. దాన్ని జనంలోకి గొప్పగా తీసుకెళ్లాలని భావిస్తుంటారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అందుకే పబ్లిసిటీని ఎక్కువగా ఆశించే నేతల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారన్న వాదన ఉంది. పబ్లిసిటీ కోరుకోవడంలో తప్పులేదేమో గానీ.. అందులో విషయం లేనప్పుడే పబ్లిసిటీ కాస్త పరువ తీసే వ్యవహారంగా మారిపోతుంది.

తాజాగా విజయవాడలో టీడీపీ నేతలకు నిర్వహిస్తోన్న శిక్షణా తరగతుల వ్యవహారం కూడా ఇలాగే తయారైంది. పాలనకు టెక్నాలజీని ఎలా జోడించాలనే విషయమై టెక్ విద్యార్థుల వద్ద టీడీపీ నేతలకు చంద్రబాబు పాఠాలు చెప్పించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను టీడీపీ బయటకు విడుదల చేసింది. అయితే అసలు మానిటర్ కూడా ఆన్ చేయకుండానే.. కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా ఉన్న గద్దె రామ్మోహన్ ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు నెటిజెన్స్.

satires on Gadde Rammohan photo in social media!

మానిటర్ కూడా ఆన్ చేయకుండానే.. కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇలా ఫోటోలకు పోజులిచ్చారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలిసి జరిగిందో తెలియక జరిగిందో గానీ మొత్తానికి టీడీపీ శిక్షణా తరగతుల వ్యవహారం ఈ ఒక్క ఫోటోతో నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. శిక్షణ ఇచ్చే మహిళ మౌస్ పట్టుకుని గద్దె రామ్మోహన్ కు టెక్ పాఠాలు చెబుతున్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. అయితే కేవలం అది ఫోటో పోజే గానీ మానిటర్ ఆన్ చేయకుండానే పాఠాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+