'సత్యం' రాజు కోర్టుకు: డిసెంబర్ 23న తీర్పు? (పిక్చర్స్)
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు డిసెంబర్ 23న వెలువడే అవకాశం ఉంది. గురువారం ప్రత్యేక న్యాయమూర్తి బివిఎల్‌ఎన్ చక్రవర్తి ఈ కేసు తీర్పు ప్రకటన తేదీ వచ్చే నెల 23గా నిర్ణయించారు. సత్యం కేసులో నిందితులుగా ఉన్న పది మంది గురువారం కోర్టుకు హాజరయ్యారు.
వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపక మాజీ చైర్మన్ బి రామలింగరాజు, ఆయన సోదరుడు, సత్యం మాజీ ఎండి బి రామలింగరాజు, కంపెనీ మాజీ సిఎఫ్‌ఒ వడ్లమాని శ్రీనివాస్, పిడబ్ల్యుసి మాజీ ఆడిటర్లు సుబ్రమణి గోపాలకృష్ణన్, టి శ్రీనివాస్, రాజు మరో సోదరుడు బి సూర్యనారాయణ రాజు, మాజీ ఉద్యోగులు జి రామకృష్ణ, డి వెంకటపతి రాజు, సిహెచ్ శ్రీశైలం, సత్యం మాజీ ఇంటర్నల్ చీఫ్ ఆడిటర్ విఎస్ ప్రభాకర్ గుప్తా ఉన్నారు.
ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో హడావుడి చోటు చేసుకుంది. కోర్టులోకి మీడియాను అనుమతించలేదు. కాగా సిబిఐ సమర్పించిన కొన్ని ఎలక్ర్టానిక్ సాక్ష్యాలను సవాలు చేస్తూ రాజు సమర్పించిన దరఖాస్తుపై విచారణ జరిగినట్టు తెలుస్తోంది.

రామలింగ రాజు ఇలా..
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు ఇలా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో హడావిడి చోటు చేసుకుంది.

రామలింగ రాజు ఇలా...
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు హైదరాబాదులోని కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాను లోనికి అనుమతించలేదు.

రామలింగ రాజు ఇలా..
సత్యం కుంభకోణం కేసులో తీర్పు డిసెంబర్ 23వ తేదీన వెలువడే అవకాశం ఉంది. గురువారంనాడు రామలింగ రాజు కోర్టుకు వచ్చారు.

రామలింగ రాజు ఇలా..
సత్యం కుంభకోణం కేసులో కోర్టుకు వచ్చిన రామలింగ రాజు కాసేపు కోర్టులో ఉన్నారు. ఈ కేసు తీర్పు డిసెంబర్ 23వ తేదీన వెలువడే అవకాశం ఉంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications