ప్రైవేట్ బస్సులను నమ్ముకోకండి బ్రో.. బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు..!!

Special Trains to Bengaluru: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లనూ పొడిగిస్తూ వస్తోన్నారు.

SC Railway has announced extension of Special Trains from Bengaluru to Bidar
  • తాజాగా బెంగళూరు నుంచి బీదర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను విడుదల చేశారు.
  • ప్రతి శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9:15 నిమిషాలకు సర్ ఎం విశ్వేశ్వరయ్య బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 06539 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు బీదర్ కు చేరుకుంటుంది.
  • ప్రతి శని, సోమవారాల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు బీదర్ నుంచి బయలుదేరే నంబర్ 06540 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4 గంటలకు సర్ ఎం విశ్వేశ్వరయ్య బెంగళూరుకు చేరుకుంటుంది.
  • యలహంక జంక్షన్, హిందూపురం, ధర్మవరం జంక్షన్, అనంతపురం, గుంతకల్ జంక్షన్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షాహాబాద్, కలబురగి జంక్షన్, హుమ్నాబాద్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+