ఇద్దరు విద్యార్థినీలతో నగ్నంగా డ్యాన్స్ చేయించాడు
ఒంగోలు: చిన్నారులతో నగ్నంగా నృత్యం చేయించిన పాఠశాల శిక్షకుడిని స్థానికులు చితకబాదిన సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర గంగవరంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో కల్లూరుకు చెందిన ఓ వ్యక్తిని విద్యా శిక్షకుడిగా నియమించారు.
సదరు ఉపాధ్యాయుడు శనివారం సెలవులో ఉన్నారు. దీంతో శిక్షకుడు ఒక్కరే విధుల్లో ఉన్నారు. పాఠశాల విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను గదికి పిలిచాడు. వారి దుస్తులు విప్పించి నృత్యం చేయించాడని స్థానికులు చెబుతున్నారు.

అది చూసిన ఓ విద్యార్థి శిక్షకుడిని ప్రశ్నించాడని, సదరు శిక్షకుడు ఆ విద్యార్థిని చితక్కొట్టారని చెబుతున్నారు. దీంతో స్థానికులు అందరూ పాఠశాల వద్దకు చేరుకొని శిక్షకుడిని చితకబాదారు. ఎంఈవో, ఇతరులు అక్కడకు చేరుకొని సర్దిచెప్పారు. శిక్షకుడిని తొలగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications