సెప్టెంబర్ లో స్కూళ్లు, ఆఫీసులు, బ్యాంకులకు వరుస సెలవులు - లిస్టు.. ఉత్తర్వులు..!!
మరోసారి విద్యార్ధులు.. ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టులో పలు ప్రత్యేక పర్వ దినాల కారణంగా సెలవులు వచ్చాయి. ఈ వారంలోనే వరలక్ష్మీ వ్రతం, మిలాదున్ నబీ వేళ వరుసగా సెలవులు ఇచ్చారు. ఇక.. వచ్చే వారం సెప్టెంబర్ తొలి వారం నుంచి ఆ నెలలో పలు సెలవులు రానున్నాయి. ఈ మేరకు అధికారికంగా సెలవులు ప్రకటించారు. క్రిష్ణాష్టమితో పాటుగా వినాయక చవితి ఈ జాబితాలో ఉంది. దీంతో.. సెలవుల వేళ ప్రత్యేక పలువురు ప్రత్యేక ప్రణాళిక లను సిద్దం చేసుకుంటున్నారు.
మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల పూర్తి కానుంది. ఈ నెలలో చివరి వారంలో వరుస సెలవులు వచ్చాయి. అదే విధంగా సెప్టెంబర్ తొలి వారంలోనూ వరుస సెలవులు రానున్నాయి. పండగ సెలవులు వారాంతంతో కలిసి వస్తున్నాయి. దీంతో వీకెండ్స్ కాస్త లాంగ్ వీకెండ్స్ గా మారటం తో అందరూ కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 4న (శుక్రవారం) అందరూ భక్తిశ్రద్దలతో పూజించే శ్రీ కృష్ణ భగవానుని జన్మదినం.

ఈరోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాలు అధికారికంగా విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటన చేసాయి. ఇక సెప్టెంబర్ 5న శనివారం... చాలామంది ఐటీ, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు ఈరోజు వీకెండ్ సెలవు ఉంటుంది.
అదే విధంగా సెప్టెంబర్ 6న ఆదివారం. ఇలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో 4,5,6 (శుక్ర, శని, ఆదివారం) మూడ్రోజులు సెలవులే. కాగా.. సెప్టెంబర్ లో ఇవే కాకుండా సెప్టెంబర్ 12: రెండో శనివారం కావటంతో అన్నింటికి సెలవు. సెప్టెంబర్ 14: గణేష్ చతుర్థి (వినాయక చవితి) సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెప్టెంబర్ 15: సంవత్సరి, సెప్టెంబర్ 21: శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం,సెలవులతో పాటుగా సెప్టెంబర్ 26: నాలుగో శనివారం సెలవు ఉండనుంది. సెప్టెంబర్ నెలలోనే ఘనంగా జరుపుకునే వినాయక చవితితో పాటుగా నిమజ్జనం వేళ హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా సెలవు ప్రకటించనున్నారు. దీంతో.. వరుస సెలవుల కారణంగా బ్యాంకు ఖాతాదారులు ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications