పండుగ వేళ చర్లపల్లి నుంచి కాకినాడ, తిరుచానూరు ప్రత్యేక రైళ్లు- రూట్, షెడ్యూల్..!!

వినాయక చవితి వేళ వరుస సెలవులు వచ్చాయి. పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి కే ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. పండుగకు మూడు రోజులు సెలవులు కావటంతో ప్రధాన రైళ్లన్నీ ముందస్తుగానే రిజర్వేషన్ పూర్తయ్యాయి. దీంతో.. ప్రధాన మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ రద్దీ కోసం వీటిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్.. రూట్.. హాల్టింగ్ స్టేషన్ల వివరాలను ప్రకటించింది.

వినాయక చవితి రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు చర్లపల్లి - కాకినాడ, చర్లపల్లి - తిరుచానూరు, వికారాబాద్ - గుంటూరు మధ్య ప్రకటించారు. రైలు నంబర్ 07039 : చర్లపల్లి - కాకినాడ టౌన్ సెప్టెంబర్ 11, 13 తేదీల్లో రాత్రి 7.50గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు కాకినాడ చేరుతుంది. రైలు నంబర్ 07040 : కాకినాడ టౌన్ - చర్లపల్లి సెప్టెంబర్ 12, 14 తేదీల్లో రాత్రి 9గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుతుందని అధికారులు వెల్లడించారు.

ఈసారి ఇంట్లోనే వినాయక చవితి..! అమెరికాలో మెసేజ్ లు పంపుకుంటున్న భారతీయులు..!
ఈసారి ఇంట్లోనే వినాయక చవితి..! అమెరికాలో మెసేజ్ లు పంపుకుంటున్న భారతీయులు..!
South Central Railway announces special trains during the Vinayaka Chaviti form Cherlapalli to Kakinadana and Tiruchanur

బర్ 07025 : చర్లపల్లి - తిరుచానూరు ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5.30గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు తిరుచానూరు చేరుతుంది. రైలు నంబర్ 07026 : తిరుచానూరు - చర్లపల్లి 12వ తేదీన మధ్యాహ్నం 1.20గంటలకు తిరుచానూరులో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3గంటలకు చర్లపల్లి చేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.

ఇక, రైలు నంబర్ 07227 : గుంటూరు - వికారాబాద్ 14వ తేదీన రాత్రి 9.45గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5గంటలకు వికారాబాద్ చేరుతుంది. రైలు నంబర్ 07228 : వికారాబాద్ - గుంటూరు 15వ తేదీన రాత్రి 8గంటలకు వికారాబాద్​లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.10గంటలకు గుంటూరు చేరుతుంది. కాకినాద రెండు వైపులా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి.

వినాయక చవితికి నారా లోకేష్ గుడ్ న్యూస్, మండపాలకు ఉచిత విద్యుత్
వినాయక చవితికి నారా లోకేష్ గుడ్ న్యూస్, మండపాలకు ఉచిత విద్యుత్

చర్లపల్లి - తిరుచానూరు - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. గుంటూరు - వికారాబాద్ - గుంటూరు ప్రత్యేక రైళ్లు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లిలో రెండు వైపులా ఆగుతాయని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+