మహాకుంభ మేళాకు మనకు ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
మహాకుంభ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలి రానున్నారు. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళా కు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లను జనవరి 18 నుంచి ఫిబ్రవరి 25 వ తేదీ మధ్యలో నడపనున్నారు. ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్లే రైళ్ల షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.
తిరుపతి నుంచి బనారస్ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు. జనవరి 18, ఫిబ్రవరి 2, 15, 22, 25 తేదీల్లో ఈ రైళ్ల రాకపోకలు ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడుదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచలి, అనకాపల్లి, రాయగడ, మునిగడ మీదుగా బనారస్ చేరుకోనుంది. అదే విధంగా బనారస్ - విజయవాడ మధ్య రైళ్లను అధికారులు ఖరారు చేసారు.

బనారస్ - విజయవాడ మధ్య నడిచే నాలుగు ప్రత్యేక రైళ్లు జనవరి 20, ఫిబ్రవరి 2, 17,24,25 తేదీల్లో నడవనున్నాయి. ఈ రైలు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు విజయవాడ చేరుతుంది. అదే విధంగా నర్సాపూర్ నుంచి బనారస్ కు రెండు ప్రత్యేక రైళ్లు జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లు ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్నాహ్నం 3.45 గంటలకు బనారస్ చేరుతుందని వెల్లడించారు. ఇక.. బనారస్ నుంచి నర్సాపూర్ మధ్య మరో రెండు రైళ్లను ప్రకటించారు.
ఈ రైళ్లు జనవరి 27, ఫిబ్రవరి 3న నడవనున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నర్సాపురం చేరుతాయి. అదే విధంగా కుంభమేళా కు వెళ్లే భక్తుల కోసం 20 ప్రత్యక రైళ్లను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రైళ్లు జనవరి 1 నుంచి మార్చి నెలాఖరు వరకు అందుబాటులో ఉండనునున్నాయి. ఈ రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభించారు. కాగా, రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసుల పైన నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications