ఆచూకీ దొరకని విమానం: కన్నీరు మున్నీరవుతున్న విశాఖవాసులు
విశాఖపట్నం: చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్‌కు వెళ్తూ అదృశ్యమైన వాయుసేన విమానం (ఎఎన్ 32) ఆచూకీ శనివారం సాయంత్రానికి కూడా లభించలేదు. విశాఖకు చెందిన ఎనిమిది మంది విధి నిర్వహణలో భాగంగా బుధవారమే విశాఖ నుంచి బయలుదేరారు. గురువారం చెన్నై చేరుకున్నారు.
శుక్రవారం ఉదయం వాయుసేన విమానంలో వీరంతా పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న విమానం గల్లంతైన విషయం ఎన్‌ఎడి అధికారుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు పెను విషాదంలో మునిగిపోయారు.

విశాఖ నగరం గోపాలపట్నం, అప్పన్నపాలెం, బుచ్చిరాజుపాలెం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వీరు ఈ నెల 20న విధి నిర్వహణలో భాగంగా పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరారు. విమానం గల్లంతైందనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునగిపోయారు.
కాగా, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ శనివారంనాడు చెన్నై చేరుకున్నారు. నావిక, వైమానిక దళాలు, కోస్ట్ గార్డులు చేపట్టిన గాలింపు చర్యలపై ఆయన వివరించారు. ఆచూకీ తీయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications