స్థానిక ఎన్నికలు, ముహూర్తం - ఎన్నికల సంఘం కీలక నిర్ణయం...!!
ఏపీలో స్థానిక ఎన్నికల కు రంగం సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం.. పార్టీలు ఇప్పటికే కసరత్తు వేగవంతం చేసాయి. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పై తీర్పు వెలువడిన తరువాత షెడ్యూల్ ను ప్రకటించేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. రిజర్వేషన్ల ఖరారు తరువాత పార్టీలు అభ్యర్ధులను ప్రకటించనున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. అదే విధంగా ఎన్నికల నిర్వహణ పైన కొత్త నిర్ణయాలతో సమాయత్తం అవుతోంది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు కసరత్తు వేగవంతం అయింది. ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ - పంచాయితీ పోల్ కోసం పోలింగ్ బూత్ లను ఖరారు చేసింది. సిబ్బంది నియామకం పైనా వివరాలు సేకరిస్తోంది. ఇక.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్రపునేఠ గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో సమావేశం కానున్నారు. వీరితో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు (బుధవారం) ఈ సమావేశం నిర్వహణకు ఏర్పాటు చేయగా, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశంలో ఎప్పుడు షెడ్యూల్ ప్రకటన చేసినా.. సిద్దంగా ఉండాలని స్పష్టం చేసే అవకాశం ఉంది.

ఎన్నికల సంఘం సమాయత్తం
కాగా.. ఎన్నికల వ్యయ పరిమితి పైనా అధికారులు స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యుడు రూ.2 లక్షలు, మున్సిపాలిటీ వార్డు సభ్యుడు రూ.1.5 లక్షలు, నగర పంచాయతీ వార్డు సభ్యుడు లక్ష రూపాయలు మాత్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. బరిలో నిలిచే అభ్యర్ధులు చేస్తున్న ఖర్చులని ప్రత్యేక అధికారుల టీమ్‌లు నిశితంగా పరిశీలించనున్నాయి. మరో వైపు పార్టీలు సైతం ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. కూటమి పార్టీలు కొత్త ఫార్ములా తో మూడు పార్టీలకు సీట్ల కేటాయింపు పైన ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. అటు మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు స్థానిక పోరు పైన దిశా నిర్దేశం చేసారు. ప్రతీ చోటా పార్టీ అభ్యర్ధి బరిలో ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. అభ్యర్ధులను ఖరారు చేస్తు న్నారు. దీంతో.. సుప్రీం తీర్పు తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సర్వం సిద్దం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
