కలెక్టర్ నివేదిక: అక్కడ ఎన్నికలు వాయిదా- ఎన్నికల సంఘం నిర్ణయం..!!

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ వచ్చిన ఫిర్యాదుల పైన పరిశీలన చేసింది. జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. మాజీ సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ ను కలిసి నామినేషన్ల వేళ చోటు చేసుకున్న ఘర్షణలపైన ఫిర్యాదు చేసారు. గవర్నర్ కు ఆధారాలు అందించారు. కాగా.. ఈ రోజు ఎన్నికల సంఘం కడప జిల్లాలో మున్సిపాల్టీ ఎన్నికల నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

స్థానిక సమరానికి సై, షెడ్యూల్ - ఏ ఎన్నిక ఎప్పుడు.. ఫలితాలు ఇలా..!!
స్థానిక సమరానికి సై, షెడ్యూల్ - ఏ ఎన్నిక ఎప్పుడు.. ఫలితాలు ఇలా..!!

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తరువాత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.నామినేషన్ల వేళ పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మాజీ సీఎం జగన్ తమ పార్టీ అభ్యర్ధులను నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ నేతలు పోలీసుల అండతో అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ తో పాటుగా గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. కాగా.. ఎనిమిది మున్సిపాల్టీలు కూటమికి ఏకగ్రీవం కానున్నాయి.

SEC Postpones Mydukuru Municipal Elections Amid Controversy as District collector report

జగన్ సొంత జిల్లా కడపనే ఎక్కువ మున్సిపాల్టీ లు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మైదుకూరు మున్సిపాలిటీలో ఎన్నికల ను నిలిపి వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సడన్ గా పులివెందులకు జగన్ - ఏకగ్రీవాల వేళ మారిన వ్యూహం..!!
సడన్ గా పులివెందులకు జగన్ - ఏకగ్రీవాల వేళ మారిన వ్యూహం..!!

మైదుకూరులో నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి మొత్తం 32 వార్డులకు మొత్తం 79 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ 56, వైఎస్సార్‌సీపీ 7, జనసేన 2, బీజేపీ 1 నామినేషన్‌ లు దాఖలు చేసాయి. మున్సిపాలిటీలో వైసీపీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో ఇది కూడా టీడీపీకి ఏకగ్రీవమైనట్టుగా కనిపించింది. వైసీపీ కేవలం ఏడు వార్డుల్లోనే నామినే షన్లు దాఖలు చేయలేదు.

ఈ క్రమంలో నామినేషన్ సెంటర్లలో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించినట్టు సిసి ఫుటేజీలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నివేదిక ఇచ్చారు. నామినేషన్ పత్రల పరిశీలన చేయడానికి వీలుకాదని ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసారు.ఈ రిపోర్ట్ ఆధారంగా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ రోజు జెడ్పీటీసీ- ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇక నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+