chandrababu: రెండో రోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రెండో రోజు హెల్త్ బులిటెన్ విడుదలైంది. జైలు ఇంఛార్జీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్.. చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో, పలు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుండటంతో జైలు అధికారులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
చంద్రబాబు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. చంద్రబాబు భద్రత కోసం ఒక హెడ్ వార్డర్, ఆరుగురు గార్డింగ్ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఆయనను ఉంచిన బ్యారక్ లోకి ఏ ఇతర గార్డింగ్ సిబ్బందికి గానీ, ఖైదీలకు గానీ ప్రవేశం లేదన్నారు. ఒక జైలరు స్థాయి అధికారి అనునిత్యం చంద్రబాబును పర్యవేక్షిస్తూ ఉంటారని వెల్లడించారు. చంద్రబాబుకు భోజన సదుపాయం అందించడం, ఇతర వసతుల సమకూర్చడాన్ని ఈ అధికారి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా జైలులోని చంద్రబాబు భద్రతపై ఆరా తీస్తూ..సూచనలు ఇస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. జైలులో ముగ్గురు వైద్యాధికారులు ఉన్నారని.. చంద్రబాబుకు రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య వివరాలను రిజిస్టర్ చేస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు హెల్త్ బులిటెన్ వివరాలు:
బీపీ: 130/80
టెంపరేచర్: సాధారణం
పల్స్: 84/మినిట్
ఫిజికల్ యాక్టివిటీ: గుడ్
హార్ట్: S1 S2
లంగ్స్: క్లియర్
SPO2G 97 శాతం.
కాగా, ఇటీవల చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురికాగా, ఆ తర్వాత ఛర్మ సంబంధిత అస్వస్థతకు గురయ్యారు. దీంతోప్రభుత్వ వైద్యులు ఆయనను పరీక్షించి అవసరమైన మందులు అందించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు, జైల్ అధికారులు చెబుతున్నారు. గురువారం తొలిసారి హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. అయితే, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications