వైసీపీపై రహస్య నివేదిక ప్రశాంత్ కిషోర్‌కు చేరిందా.. ?

ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా పలు వేదికల్లో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. జగన్ పాలన మీద తీవ్ర వ్యతిరేకత ఉందని..ఆయన తిరిగి గెలిచే అవకాశాలు లేవని..151 సీట్లు ఉన్న పార్టీని 50 స్థానాలకు తీసుకువస్తున్నారని ప్రశాంత్ కిషోర్ వైసీపీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాతే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సైతం కౌంటరిచ్చారు.

ఐ ప్యాక్ ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో జగన్ మాట్లాడుతూ.. కచ్చింతగా మనమే అధికారంలోకి వస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు జగన్‌కు కౌంటరిచ్చారు. ప్రశాంత్ కిశోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తన అనుభవంతో చెబుతున్నానని.. జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రారని..జూన్ 4న ఫలితాల తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని ఆయన పేర్కొన్నారు.

secret report on YCP reached Prashant Kishor

అయితే ప్రశాంత్ కిషోర్ అంత కచ్చింతంగా జగన్ ఓడిపోతారని ఎలా చెబుతున్నారో వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలతో పాటు, ఐ ప్యాక్ ఇచ్చిన రిపోర్టులో కూడా తిరిగి జగనే విజయం సాధిస్తారని తేల్చి చెప్పడం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరీ ఇలాంటి తరుణంలో కూడా వైసీపీ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పడంపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయడంతో, వారే ప్రశాంత్ కిషోర్‌కు దీనిపై నివేదిక ఇచ్చారా ? అందుకే ఇంత ధైర్యంగా ప్రశాంత్ కిషోర్ వైసిపి అధికారంలోకి రాదని చెబుతున్నారా అనే అనుమానాలు వైసీపీ నేతల్లోనూ కలుగుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు కూటమి నేతల్లో ఫుల్ జోష్‌ను నింపుతున్నాయి. మరీ వైసీపీ విషయంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజం అవుతాయో లేదో తెలియాలంటే జూన్ 4న వరకు వేచి చూడాల్సిందే.

.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+