సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో కొత్త ట్విస్ట్ - వాట్ నెక్స్ట్..!!

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో అయోమయం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉద్యోగుల బదిలీల్లో సచివాలయాల ఉద్యోగుల బదిలీకి అనుమతి ఇచ్చింది. ఈ నెలాఖరు లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయిదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధన సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో డైలమా కు కారణం అవుతోంది.

బదిలీ ప్రక్రియ
బదిలీల విషయంలో సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో 2024 జూలై 31 నాటికి అయిదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ వర్తిస్తుందన్న ప్రభుత్వ నిబంధనతో వీరు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.34 లక్షల మంది సచివాలయాల ఉద్యోగుల్లో లక్ష మందికి పైగా సర్వీసు అక్టోబర్ 1, 2024 నాటికి అయిదేళ్లు పూర్తవుతుంది. పిరపాలనా సౌలభ్యం పేరుతో బదిలీ చేసే వీలున్నా కొద్ది మందికే అవకాశం దక్కనుంది.

Secretariats Employees dilemma over Govt latest decision for General Transfers

తాజా ఉత్తర్వులతో
అయిదేళ్ల సర్వీసు పూర్తి కానందున మిగిలిన వారు దరఖాస్తు చేసుకున్న పరిగణలోకి తీసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు.దీంతో, మండల..జిల్లాయేతర ప్రాంతాల్లో నాలుగేళ్లకు పైగా పని చస్తున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఏడాది క్రితం నిర్వహించిన బదిలీల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాకుండా భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులైన వారికి బదిలీకి వెసులుబాటు కల్పించినా కొద్ది మందికే అవకాశం దక్కింది. ఉద్యోగుల్లో అత్యధికులు అవివాహితులు కావటం మరో కారణంగా చెబుతున్నారు.

ఉద్యోగుల అభ్యర్దన
ప్రభుత్వం తాజాగా ఖరారు చేసిన మార్గదర్శకాల్లో అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధనతో ఇప్పటి వరకు 4 ఏళ్ల 9 నెలల సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు కటాప్ తేదీ అక్టోబర్ లేదా నవంబర్ కు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈ నెలాఖరు నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+