AOBలో తప్పిన పెనుముప్పు- మావోయిస్టుల దుశ్చర్యకు బ్రేక్-భద్రతాదళాలు సేఫ్
మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కొంతకాలంగా పోలీసులు భారీగా కూంబింగ్ చేపడుతున్నారు. తాజాగా పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడటం, ఇతరత్రా కారణాలతో ఇదే అదనుగా బీఎస్ఎప్‌తో పాటు ఒడిశా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు మావోయిస్టులు పలుచోట్ల మందుపాతరలు అమర్చారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇలా అమర్చిన రెండు మందుపాతరలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయి. రహదారి కింద అమర్చిన ఈ మందుపాతరలను విజయవంతంగా గుర్తించి నిర్వీర్యం చేయడంతో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటుచేసిన రెండు మందుపాతరలను గాలింపు సందర్భంగా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలో జాజుపాలెం-కెందుగుడా వద్ద జరుగుతున్న నిర్మాణంలో భాగంగా రహదారిలో ఏర్పాటు చేసిన రెండు టిఫిన్ ఐఈడీలను బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల గాలింపు చేపట్టేందుకు వస్తున్న ఆంధ్రా-ఒడిశా బలగాలను తుదముట్టించడానికి నిర్మాణంలో ఉన్న రహదారిని మావోయిస్టులు ఎంచుకుని రెండు మందుపాతరలను ఏర్పాటు చేశారు.
AOBలో తప్పిన పెనుముప్పు- మావోయిస్టుల దుశ్చర్యకు బ్రేక్-భద్రతాదళాలు సేఫ్#Andhrapradesh #Srikakulam #AOB pic.twitter.com/L8LbqSh8N2
— oneindiatelugu (@oneindiatelugu) June 23, 2021
వీటిపై పక్కా సమాచారం అందుకున్న ఒడిశా పోలీసులు మరియు బీ ఎస్ ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు నిర్వహించి మందుపాతరలను కనుకున్నారు. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలను పిలిపించి మందుపాతరలను తొలగించారు.ఒక్కొక్క మందుపాతర 2.5 బరువు ఉందని పోలీసువర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications