సీఎం జగన్ భద్రతలో నిర్లక్ష్యం : ముఖ్యమంత్రే వద్దన్నారు: ఎవరు బాధ్యులు..!
Recommended Video
సీఎం జగన్ కు భద్రత విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సీఎం కాన్వాయ్‌లోకి సాధారణ వాహనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తున్న సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇతర వాహనాలను అనుమతించరు. కానీ, జగన్ రాజన్న బడిబాట కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వైసీపీ ముఖ్యులు పోలీసుల ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయితే, తన కోసం ట్రాఫిక్ ఆపవద్దని..ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని గతంలో జగన్ సూచించారు..
సీఎం కాన్వాయ్‌లోకి వాహనాలు..
ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న వాహన శ్రేణి మధ్యలోకి ఇతర వాహనాలు కలిసిపోయాయి. సీఎం జగన్ శుక్రవారం తన నివాసం నుండి పెనుమాకలో ఏర్పాటు చేసిన రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొంనేందుకు బయల్దేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్ పెనుమాక నుండి ఉండవల్లి సెంటర్ మీదుగా తాడేపల్లి వైపుకు వస్తుండగా ఉండవల్లి నుండి ప్రకాశం బ్యారేజి వైపు వెళ్లే వాహనాలను ఒక్క సారిగా వదిలేసారు. దీంతో సీఎం కాన్వాయ్‌లో ఇతర వాహనాలు కలిసి పోయాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి ప్రయాణించే సమయంలోనే ఇతర వాహనాలను అనుమతించటం పైన పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని పైన వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. జరిగిన విషయం తెలుసుకొని వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించారు. ముఖ్యమంత్రి భద్రతా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన వేల..ఈ రకంగా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.

జగన్ గతంలో ఏం చెప్పారంటే..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేసారు. జగన్ తన నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే సమయంలో మార్గ మధ్యలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసారు. దీని కారణంగా ఎండలోనే సాధారణ ప్రజానీకం నిలబడి ఉండటాన్ని ముఖ్యమంత్రి గమనించారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని..గన్నవరం వెళ్లేందుకు తనకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో.. ఉండవల్లి లోని సీఎం నివాసం నుండి గన్నవరం వరకు ప్రత్యామ్నాయ మార్గం చూసే వరకూ హెలికాఫ్టర ద్వారా గన్నవరం చేరుకొనేలా చూడాలని అధికారులు భావించారు. అయితే, ముఖ్యమంత్రి నివాసం వద్ద హెలిపాడ్‌కు అనువుగా లేకపోవటంతో..ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఇక, తాగా ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు సైతం అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications