సీమాంధ్ర రాజధాని: గుంటూరు - బెజవాడ అనుకూలం!

హైదరాబాద్/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు - విజయవాడ మధ్యనే రాజధాని ఏర్పాటుకు సిఫారసు చేయాలని కోరుతూ శివరామకృష్ణన్ కమిటీకి విజ్ఞాపనలు వెల్లువెత్తాయి. కమిటీ సభ్యులు సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీనియర్ రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి గల అన్ని వనరులు గుంటూరు - విజయవాడ మధ్య ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని స్థానికంగానే రాజధానిని ఏర్పాటు చేయాలని పలువురు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌లో రాజధాని అవసరం లేదని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో తాత్కాలిక శాసనసభ, సచివాలయం ఏర్పాటు చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. మూడునాలుగేళ్లలోనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోగలమని పేర్కొన్నారు.

మరోవైపు మంగళగిరి, తాడేపల్లి, ఏఎన్‌యూ, అమరావతి, లాంఫాంలను సందర్శించిన అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. అటుపైన ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించిన సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ కమిటీ ఎదుట తన వాదన వినిపించారు.

Seemandhra capital between Vijayawada and Guntur

రాజధాని నిర్మాణానికి వేలు, లక్ష ఎకరాల భూమి అవసరం లేదని చెప్పారు. కేంద్రం ప్యాకేజిలో ప్రకటించిన ఐఐటి, ట్రిపుల్ ఐటి, నిట్, పెట్రోలియం వర్సిటీ, రైల్వేజోన్, హైకోర్టు, గిరిజన విశ్వవిద్యాలయం వంటి సంస్థలను 13 జిల్లాల్లో నెలకొల్పాలన్నారు. వుడా చైర్మన్ వణుకూరి శ్రీనివాస రెడ్డి అనేక అనుకూలాంశాలను కమిటీకి వివరించారు.

నాగార్జున విశ్వవిద్యాలయంలో అసెంబ్లీ నిర్వహణకు అన్ని హంగులతో కూడిన ఆడిటోరియం ఉందని పలువురు సూచించారు. 270 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. గుంటూరు - విజయవాడ నగరాల మధ్య 15 నుండి 16 లక్షల జనాభా నివసిస్తోందని, అనేక ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెబుతున్నారు.

మిర్చి, ప్రత్తి, పొగాకు వంటి పంటలు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారని, మౌలిక వసతుల పరంగా రైల్వే, విమానయానం వంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయన్నారు. రాజధాని కోసం గుంటూరు - విజయవాడ నగరాలను ఎంపిక చేసుకుంటే రాజధాని నిర్మాణం, దాని అభివృద్ధికి పదేళ్లు అవసరం లేదన్నారు. రాజధాని నగరం అంటే వికేంద్రీకరణ జరగాలన్నారు. గుంటూరు సమీపంలో ప్రత్తిపాడు రోడ్డులో 250 ఎకరాల ప్రభుత్వ, రిజర్వ భూములు కౌలుదారీ రైతుల చేతుల్లో ఉన్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+