ఈస్టిండియా కంపెనీకి చంద్రబాబుకు తేడా లేదు: తమ్మినేని సీతారాం
హైదరాబాద్: ఈస్టిండియా కంపెనీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య తేడా ఏమీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో పేదల భూములను లాక్కుంటోందని ఆయన విమర్శించారు.
రాజధాని పేరుతో తాబేదారులకు చంద్రబాబు భూములను కట్టబెడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. రైతుల పొట్ట కొట్టి రాజకీయ నాయకుల జేబులు నింపుతున్నారని ఆయన మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ నేతలకు, వారి బంధువులకు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను చౌకగా కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్టోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications