కాపాడుకుంటాం: సీతక్క, ఇవి వద్దు: కెసిఆర్‌కు పొన్నాల

టీడీపీకి కార్యకర్తలే పార్టీకి బలమని, వారిని కాపాడుకుంటామన్నారు. ఎన్నికల ముందు పార్టీ కేడర్ కొంత దెబ్బతిన్నా వారినందరినీ ఒకే తాటిమీదకు తీసుకువస్తామన్నారు. పటిష్టమైన నిర్మాణంతో కూడుకున్నటువంటి లక్షలాదిమంది కార్యకర్తలతో బలమైన కేడర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
కెసిఆర్ మానేయి: పొన్నాల
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వలసలను ప్రొత్సహించడం మానుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో అన్నారు. ఈ రకమైనటువంటి చర్యలు తెరాసకు మంచిదికాదన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తెరాస పెట్టిన అంశాలపై సహకరిస్తామని చెప్పామని, అవి అమలు చేయలేని పక్షంలో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామన్నారు.
కడపకు జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు కడపలో పర్యటించనున్నారు. పార్టీ కేడర్‌కు, తనకు మద్దతు పలికిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపనున్నారు.












Click it and Unblock the Notifications