ముగ్దుడ్నయ్య, అందుకే తెరాసలోకి: అల్లుఅర్జున్ మామ

తెలంగాణ ఉద్యమంలో తాము పాల్గొన్నామని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. తెలంగాణ కోసం పాదయాత్రలు, సెమినార్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు కోరుకున్న తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంతో పాటు, కెసిఆర్ రచించిన భవిష్యత్తు ప్రణాళికకు ముగ్దుడనై తెరాసలో చేరుతున్నట్లు చెప్పారు. తాను తెలంగాణకు చేసిన సేవలను కెసిఆర్ గుర్తించినందుకు ధన్యవాదాలు అన్నారు.
నామాపై బాలసాని ఆగ్రహం
ఖమ్మం జిల్లా టిడిపిలో అసంతృప్తి సెగలు రాజుకున్నారు. కొత్తగూడెం టికెట్‌ను కోనేరు చిన్నికి కేటాయించడంపై బాలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా నాగేశ్వర రావుపై నిప్పులు చెరిరారు. తనకు కేటాయించిన కొత్తగూడెం టికెట్‌ను నామా రాత్రి రాత్రే చిన్నికి ఇప్పించారని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో బిసిలకు నామా ద్రోహం చేశారన్నారు. నామా ఇంత దుర్మారంగా వ్యవహరిస్తారని అనుకోలేదని, చంద్రబాబును నామా తప్పుదో పట్టించి జిల్లాలో బిసిల గొంతు నొక్కారన్నారు. మరోవైపు బాలసాని నివాసినిక వెళ్లిన నామాను బాలసాని అనుచరులకు అడ్డుకున్నారు. నామా గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications