భార్యతో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సెల్ఫీ, చిక్కుల్లో పడేసింది
విశాఖ: సెల్ఫీ పిచ్చి ఓ నక్సలైట్‌ను చిక్కుల్లో పడేసింది. ఇప్పుడు అందరికి సెల్ఫీ పిచ్చి ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకొని దానిని సామాజిక అనుసంధాన వేదికలలో పంచుకుంటున్నారు. అలాంటి సెల్ఫీయే నక్సలైట్‌ను చిక్కుల్లో పడేసింది.
సదరు నక్సలైట్ చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతనిని పట్టుకుందామన్నా కనీసం అతనెలా ఉంటాడో కూడా పోలీసులకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ మావోయిస్ట్ సెల్ఫీ క్రేజే పోలీసుల పనిని సగానికి సగం తగ్గించింది.

ఆ సెల్ఫీలో ఉన్నది ఎవరో కాదు ఏపీలోని తూర్పు డివిజన్ సెక్రటరీ, మోస్ట్ వాంటెడ్ చలపతి అలియాస్ అప్పారావు, అతని భార్య అరుణ. మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఆజాద్ అనే మావోయిస్టు లాప్‌టాప్ నుంచి ఈ ఫొటోను సేకరించారు పోలీసులు.
అతని ఫోటో దొరకగానే పోలీసులు ఏజెన్సీ ఏరియాల్లో అతని ఫోటోను అతికించారు. ఇప్పటికే చలపతిపై 20 లక్షల రివార్డు, అరుణపై 5 లక్షల రివార్డు ఉంది. చనిపోయిన ఆజాద్.. అరుణకి సోదరుడు. ఓ స్మార్ట్‌ఫోన్ సాయంతో వీళ్లిద్దరూ సెల్ఫీ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications