అఖిలప్రియపై వ్యాఖ్యలు?: రోజాకు భర్త సెల్వమణి క్లాస్..

ఇదే విషయం రోజా భర్త సెల్వమణి సైతం ఆమెను సున్నితంగా మందలించారట. మరోసారి ఇలాంటి వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా ఉండాలని సూచించారట.

నగరి: ఫైర్ బ్రాండ్ ముద్రతో ప్రత్యర్థులను కడిగిపారేసే రోజాకు 'మిస్ ఫైర్' బాధలు తప్పడం లేదు. ఎటాక్ చేయాలన్న ఆవేశమే తప్ప.. కొన్నిసార్లు అనాలోచితంగా వ్యవహరిస్తూ సొంత పార్టీకి కూడా తలనొప్పులు తీసుకొస్తున్నారు.

ఇటీవల మంత్రి అఖిలప్రియపై ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ కావడంతో.. తిరిగి తానే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కాస్త రోజా భర్త సెల్వమణిని సైతం ఇబ్బందిపెట్టేందిగా మారిందన్నది ప్రస్తుతం తెరపైకి వస్తున్న తాజా కథనం.

 selvamani suggestion to roja over controversial comments

చుడీదార్‌లు వేసుకునే నువ్వా సంప్రదాయం గురించి మాట్లాడేది? అని ఓ టీవి చానెల్ చర్చలో రోజా అఖిలప్రియను విమర్శించడం ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. సినిమాల్లో నటించిన మీరేనా.. డ్రెస్సుల గురించి మాట్లాడేది? అంటూ టీడీపీ నుంచి గట్టి కౌంటర్ మొదలైంది.

ఈ మధ్య రోజా భర్త సెల్వమణి ఎక్కడికెళ్లినా.. ఆయనకు ఇదే ప్రశ్న ఎదురవుతుందట. రోజా అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ చాలామంది ఆయనతో చెబుతుండటంతో.. ఇదే విషయాన్ని ఆయన భార్య వద్ద ప్రస్తావించారట. ఇలాంటి వ్యాఖ్యల జోలికి పోకుండా ఉంటేనే మంచిదని సున్నితంగా మందలించారట. మరి సెల్వమణి మాటలను రోజా పాటిస్తారా?..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+