పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తా - హీరోయిన్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశాయి. శనివారం అధికార వైసీపీ మ్యానిఫెస్టోను అధికార పార్టీ విడుదల చేయగా, మంగళవారం జనసేన, టీడీపీ ఉమ్మడి మ్యానిఫెస్టోను పవన్ కల్యాణ్, చంద్రబాబులు విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి జాతీయ పార్టీ అయిన బీజేపీ దూరంగా ఉంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారాయన. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో ఆయన కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈక్రమంలోనే పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి విసృతంగా ప్రచారం నిర్వహించారాయన. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాగబాబు ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి ఖుష్బు సైతం పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం నిర్వహించడానికి తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు.

ఖుష్బు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. త్వరలో రాష్ట్రంలో కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆమె తెలిపారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారామె. పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా టైంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అయన ఎప్పుడూ పాలిటిక్స్ గురించి నా దగ్గర చర్చించలేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన పిలిస్తే ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానంటూ ఖుష్బు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications