సోము వీర్రాజు దారెటు?
Somu Veerraju: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. టీడీపీ అయిదు, జనసేన మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
బీజేపీ తాజాగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఎచ్చెర్ల- ఎన్ ఈశ్వరరావు, విశాఖపట్నం నార్త్- పీ విష్ణుకుమార్ రాజు, అరకు (ఎస్టీ రిజర్వుడ్)- పంగి రాజారావు, అనపర్తి- శివ కృష్ణంరాజు, కైకలూరు- కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి, బద్వేలు (ఎస్సీ రిజర్వుడ్)- బొజ్జా రోశన్న, జమ్మలమడుగు- సీ ఆదినారాయణరెడ్డి, ఆదోని- డాక్టర్ పీవీ పార్థసారథి, ధర్మవరం- వై సత్యకుమార్‌కు టికెట్ లభించింది.

ఈ జాబితాలో బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి సహా మరికొందరు ఆశావహుల పేర్లు లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కాస్త పార్టీలో తీవ్ర చర్చనీయాంశమౌతోంది. అసలు సిసలు బీజేపీ నాయకులకు టికెట్లు లభించకపోవడం పట్ల అసంతృప్త వాతావరణం నెలకొంది.
నిజానికి- తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటు టికెట్‌ను సోము వీర్రాజుకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది గానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. అనపర్తి టికెట్‌ను శివ కృష్ణంరాజుకు కేటాయించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ- ఆ ఓటుబ్యాంకు బలంగా ఉన్న చోట సోముకు టికెట్ దక్కలేదు.
2004లో సోము వీర్రాజు ఎన్నికల బరిలో నిల్చొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కడియం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ గెలవలేకపోయారు. కాంగ్రెస్‌కు చెందిన జక్కంపూడి రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. రెండో స్థానానికి పరిమితం అయ్యారు. 2015లో శాసన మండలికి ఎన్నికయ్యారు. ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయలేదు గానీ బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవులను పొందారు.
పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉంటూ వచ్చినప్పటికీ- ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కించుకోలేకపోయారు. శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి.. ఆయన సొంత నియోజకవర్గం. పొత్తులో భాగంగా ఈ స్థానంలో టీడీపీ పోటీ చేస్తోంది. కందికుంట యశోదా దేవికి టికెట్ ఇచ్చింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications