ఏపీ కొత్త సీఎస్‌గా ఈ సీనియర్ ఐఏఎస్ అధికారే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనేది దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో కొత్త సీఎస్ ఎవరన్నదానిపై గత కొద్ది రోజులుగా జోరుగా చర్చసాగుతోంది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది.
అయితే, చివరంగా ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ పేరు దాదాపు ఖరారైందని తెలిసింది. ఆదివారం (డిసెంబర్ 28న) నాడు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సీనియర్ ఏఐఎస్ అధికారివైపే మొగ్గు చూపడంతో దయానంద్ కొత్త సీఎస్‌గా ఖరారైనట్లు తెలుస్తోంది.

కాగా, కె. విజయానంద్, 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఫిబ్రవరి, 2022 నుంచి ఏపీ జెన్‌కోకి ఛైర్మన్‌గా, ఏప్రిల్ 2023 నుంచి ఏపీ ట్రాన్స్‌కోకు సీఎండీగా ఉన్నారు. ఏపీ జెన్‌కో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సంస్థ మొత్తం శక్తి అవసరాలలో 40-45% వాటాను అందిస్తుంది.
కె. విజయానంద్ 1993లో అసిస్టెంట్‌గా భారతీయ బ్యూరోక్రసీ వృత్తిని ప్రారంభించారు. ఆదిలాబాద్ కలెక్టర్, రంపచోడవరం సబ్ కలెక్టర్, శ్రీకాకుళం కలెక్టర్, APGENCO మేనేజింగ్ డైరెక్టర్, APTRANSCO CMD 2016 నుంచి 2019 వరకు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు పనిచేశారు. ఇప్పుడు విజయానంద్ ప్రభుత్వ కార్యదర్శి, ఇంధనం స్పెషల్ చీఫ్‌గా ఉన్నారు. కాగా, ఈయన కంటే మరికొందరు సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు ఉన్నప్పటికీ.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని విజయానంద్ ను కొత్త సీఎస్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications