TTD: టీటీడీ ఆఫీసులో అగ్నిప్రమాదంపై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని ఫైల్స్ ఖాళి దగ్ధమయ్యాయని సమాచారం. కీలకమైన ఫైల్స్ ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. టీటీడీ పరిపాలనా భవనం అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కు ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ నిషాంత్ రెడ్డి సంఘటనా స్థలంలో పరిశీలించి టీటీడీ అధికారులు, సిబ్బంది నుంచి సమాచారం సేకరించి జిల్లా యంత్రాంగాణికి నివేదిక అందించారు. తిరుపతి జిల్లా ఎస్సీ సుబ్బారాయుడు కూడా టీటీడీ పరిపాలనా భవనంలో పరిశీలించి వివరాలు సేకరించారు.

ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు జాగిలాలతో పరిశీలించి వివరాలు సేకరించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అలియాస్ శ్రీనివాసులు కూడా టీటీడీ పరిపాలనా భవనాన్ని ఆదివారం పరిశీలించి పోలీసులు, టీటీడీ అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఈ సందర్బంగా తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైల్స్ దగ్దం కావడంతో తనతో పాటు చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయని జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు. తిరుపతికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం ప్రజలు మరిచిపోకముందే ఇప్పుడు తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనంలో, పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో అనేక అనుమానాలు ఉన్నాయని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని కొందరికి ఇటీవల విజిలెన్స్ అధికారులు తాఖీదులు జారీ చేశారని, ఆ విషయం అందరికీ తెలుసు అని, పలు అక్రమాలు జరిగాయని అందరికి అనుమానాలు ఉన్నాయని, అందుకే విజిలెన్స్ ఎంట్రీ ఇచ్చిందని జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు.

ఇలాంటి సమయంలోనే టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడంలేదని, ఈ విషయంలో తనతో పాటు టీటీడీ భక్తులకు చాలా అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారని శ్రీనివాసులు అన్నారు.
ఈ విషయంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని తాను కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు మనవి చేశానని, పోలీసు అధికారుల దర్యాప్తులో వాస్తవాలు పూర్తిగా బయటకు వస్తాయని, ఈ కేసులో ఎవ్వరూ తప్పించుకోలేరని, శ్రీవెంకటేశర్వస్వామి నిందితులను కఠినంగా శిక్షిస్తారని, తప్పు చేసిన వారికి అప్పుడే భయం పుట్టుకుందని తిరుపతి జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు చెప్పారు.












Click it and Unblock the Notifications