జేసీ పంది కన్నా హీనంగా బతుకుతున్నాడు: నవ్వుతూనే పెద్దారెడ్డి చురక

విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరు, తాడిపత్రిల్లో తనకు ఇళ్లున్నాయని, ఊటీలో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందని జేసీ తెలిపారు. జేసీ వ్యాఖ్యలపై పెద్దారెడ్డి నవ్వుతూనే చురకలంటించారు.

తాడిపత్రి: అనంత రాజకీయాల్లో పెద్దారెడ్డి-జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య రాజకీయ పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇరువురు పదునైన వ్యాఖ్యలతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో హల్‌చల్ చేశారు.

అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ పెద్దారెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు. పెద్దారెడ్డి తాడిపత్రి రాగాలేనిది తాను తిమ్మంపల్లి రాలేనా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తిమ్మంపల్లిలోనే ఇల్లు కొనుక్కుంటున్నానని చెప్పారు. పనిలో పనిగా ప్రస్తుతం తనకు ఎక్కడెక్కడ ఇళ్లున్నాయో.. ఆ చిట్టా అంతా చెప్పుకొచ్చారు.

sensational comments of Peddareddy on JC diwakar reddy

విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరు, తాడిపత్రిల్లో తనకు ఇళ్లున్నాయని, ఊటీలో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందని జేసీ తెలిపారు. జేసీ వ్యాఖ్యలపై పెద్దారెడ్డి నవ్వుతూనే చురకలంటించారు. తిమ్మంపల్లిలో చైతన్యవంతులు ఉన్నారని, అక్కడి రెడ్లకు పౌరుషం ఉందో లేదో తెలియదు గానీ ఇక్కడి రెడ్లకు మాత్రం పౌరుషం ఉందని అన్నారు. తాము మాట అంటే పడే వ్యక్తులం కాదన్నారు.

భారీ పోలీసు బలగంతో జేసీ తిమ్మంపల్లిలో హల్ చల్ చేయడం పట్ల పెద్దారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతమంది పోలీస్ జేసీకి ప్రొటెక్షన్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. జేసీ ఏమైనా మంత్రా? అని నిలదీశారు.

చివరగా తన విమర్శలకు మరింత పదును పెట్టిన పెద్దారెడ్డి.. 'మునిసిపల్ సొమ్ము తిని జేసీ పంది కన్నా హీనంగా బతుకుతున్నారు' అంటూ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+