Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు

ప్రయాణికుల అదనపు రద్దీని నివారించడానికి రైల్వే అధికారులు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొన్నటి హోలీ పండగ నేపథ్యంలో చర్లపల్లి, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైళ్లు రెగ్యులర్ సర్వీసులుగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో వీటిని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల నుండి రెగ్యులర్ ట్రైన్లుగా మార్ప చేశారు.

యలహంక-సంత్రగచ్చి..

ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు కూడా ఉన్నాయి. యలహంక -సంత్రాగచ్చి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు ఇప్పుడు రెగ్యులర్ అయ్యాయి. 02863/02864 యలహంక-సంత్రగచ్చి స్పెషల్ నంబర్ కూడా మారింది. రెగ్యులర్ నంబర్ ను దీనికి కేటాయించారు. ఈ రైలు ఇకపై 18063/18064 నంబర్ తో ప్రయాణికులకు అందుబాటలో ఉంటుంది. యలహంక-సంత్రాగచ్చి ఏసీ ఎక్స్‌ప్రెస్ గా మారింది.

SER Regularises Six Pairs of Special Trains Across Routes Including Yelahanka- Santragachi AC Express

ఏప్రిల్ 2 నుండి ప్రతి గురువారం సంత్రాగచ్చి నుంచి మధ్యాహ్నం 12:50 నిమిషాలకు బయలుదేరే నంబర్ 18063 ఏసీ ఎక్స్‌ప్రెస్ రెండో రోజు వేకువజామున 12:20 నిమిషాలకు యలహంకకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 7 నుండి ప్రతి మంగళవారం యలహంక నుంచి తెల్లవారు జామున 4:50 నిమిషాలకు బయలుదేరే నంబర్ 18064 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.

ఖరగ్‌పూర్, బాలసోర్, రాణితల్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం నార్త్ (ఆపరేషనల్ స్టాప్), దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, కృష్ణా కెనాల్, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపూరం, ధర్మవరం, హిందూపూరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

షాలిమార్-ఎంజీఆర్ చెన్నై..

02841/02842 షాలిమార్-ఎంజీఆర్ చెన్నై మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు కూడా రెగ్యులర్ అయింది. ఇకపై ఇది 18041/18042 షాలిమార్-ఎంజీఆర్ చెన్నైఎక్స్‌ప్రెస్ గా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

ఏప్రిల్ 6 నుండి ప్రతి సోమవారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు షాలిమార్ నుండి బయలుదేరే నంబర్ 18041 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు సాయంత్రం 4:45 నిమిషాలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం సాయంత్రం 6:45 నిమిషాలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరే నంబర్ 18042 ఎక్స్‌ప్రెస్ రెండో రోజు తెల్లవారుజామున 4 గంటలకు షాలిమార్‌కు చేరుకొంటుంది.

షాలిమార్, సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్, బాలసోర్, రాణితల్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, విజయనగరం, సింహాచలం నార్త్, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+